Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా నాయకుల శిక్షణా తరగతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
దేశంలో పార్టీలు అన్నీ ఒక ఎత్తయితే సీపీఐఎం పార్టీ ఒకఎత్తు అని ప్రజా స మస్యలపై రాజకీయ విప్లవంతో పోరాడి సమస్యలను సాధించుకునేలా చేసిన పా ర్టీ ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. తూర్పు నియోజకవర్గం లోని శ్రీరామ సురేందర్ భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ వ్యవహరించిన జి ల్లా క్యాడర్ క్లాసుల రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశంలో రెండు రకాల పార్టీలు ఉంటాయని ఒకటి విప్లవ రాజకీయ పార్టీ కాగా రెండవది బూర్జువా రాజకీయపార్టీలన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తూ దేశ అభివృద్ధికాంక్షిస్తూ సమాజాన్ని మార్చాలని పద్ధతితో విప్లవం రాజకీయ ం చేసే పార్టీ సీపీఎం కాగా స్వార్థంతో దోచుకొంటూ దేశాన్ని అధోగతి పాలు చేస్తూ ఆస్తులు పెంచుకుంటూ బూర్జువ రాజకీయ పార్టీలు ఉంటాయన్నారు. మనం క మ్యూనిస్టులం కాబట్టి విప్లవం కోరుకుంటూ ముందుకు పోతామని సైద్ధాంతికంగా సమస్య వచ్చి 1920 భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్స్ట్గా ఏర్పడిందన్నారు. భా రత స్వాతంత్య్రంలో కీలకపాత్ర పోషించడం జరిగిందని కొన్ని చీలికలు వచ్చి 1964లో సీపీఐగా మార్పు చెంది ఆర్థిక సామాజిక పరిస్థితిపై ప్రజల్లో చైతన్యాన్ని నింపి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో మీద పోరాడేలా చేసిందన్నారు. ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ పేదలకు భూములు పంచకుండా, రైతుకూలీలకు అండగా ఉండకుండా బడా భూస్వాములకు వేలఎకరాలు దోచి పెడుతున్నారని విమర్శించారు. కేవలం పేదలపక్షాన పోరాడే ఏకైక పార్టీ సీపీ ఐ ఎం అని పార్టీసిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ మన దేశ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ పై నడుస్తూన్నాయని భూస్వామ్య వ్యవస్థలో కూలిదోపిడీ,కౌలు దోపిడి మహిళలకు తక్కువ వేతనాల దోపిడీ కుల వ్యవస్థ మూఢనమ్మకాలు అన్నిటిని పెంచి పోషించే లా ఉన్నాయని అన్నారు. దేశంలో కొద్దిమంది చేతుల్లో భూములు ఉన్నాయని గ్రామాలలో కూలీలకు కనీసం కూలి ఇవ్వడం లేదని మహిళలకు తక్కువ కూలి ఇవ్వడం వ్యాపారాలు అధికరణ ఉండడంతో ఆర్థికంగా మనము వెనుకబడిపోయా మని అన్నారు. వేలాది ఎకరాల్లో భూస్వాములు ప్రజలపై పెత్తనాలు చేస్తూ కౌలుదారులు అప్పుల పా లు అయ్యేలా చేస్తున్నారని అన్నారు.
అలాగే రాజకీయ వ్యవస్థ వారసత్వ వ్యవస్థ గా మారిందని వీటన్నిటిపై సమా జాన్ని ఆర్థిక ఉత్పత్తి పునాదుల పరంపర మొదలై గుత్తేదారులు పెట్టుబడిదారులు భూస్వాముల చేతుల్లోకి అధికారం వెళ్లిందని పోలీసులు కోర్టులు కూడా అలాంటి వారి చేతుల్లోకి వెళ్లాయని మనందరం కలిసి మెలిసి పోరాడుతూ ప్రజల్లో చైతన్యం నింపాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్య వర్గ సభ్యులు ఎండి.బషీర్, యాదగిరి, రంగసాయిపేట ఏరియా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.