Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిపి వర్మి కంపోస్ట్ తయారీపై విదేశీయుల అభినందన
నవతెలంగాణ-రాయపర్తి
మండలంలోని రాగన్నగూడెం గ్రామపంచాయతీని 14 దేశాలకు సంబంధిం చిన విదేశీయులు గురువారం సందర్శించారు. గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ రెంటాల గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశీ యులు రైతులతో మాట్లాడి సేంద్రియ వ్యవసాయ విధానంపై రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. తదుపరి వ్యవసాయ క్షేత్రాలను సందర్శిం చారు. గ్రామపంచాయతీ డంపింగ్ యార్డులో తయారు చేస్తున్న వర్మి కంపోస్ట్ ప్ర క్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డికి అభినం దనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో జాతీయ గ్రామీణాభివద్ధి, గ్రామపంచాయతీ రాజ్ సం స్థ కోఆర్డినేటర్ ప్రదీప్ రెడ్డి, బాలవికాసం ప్రతినిధులు ప్రిన్సిస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మహేష్, రైతులు సరికొండ కష్ణారెడ్డి, కంది కుమార్, ఆకుల రాములు, పోగు ల కొండ ఎల్లమ్మ, సరికొండ రాజు, పరిపాటి సుధాకర్ రెడ్డి, కంది శీను, లక్కం కిరణ్ కుమార్, పోగులకొండ మల్లయ్య, మల్కయ్య యాకయ్య, స్వరూప, కంది మల్లయ్య, కుంభం రత్నాకర్ రెడ్డి, బాలగోని బిక్షపతి, పెద్ద బిక్షపతి, చింతరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆకుల నారాయణ, కొలువు శ్రీను, రజిని, పద్మజ, యాకుబ్ రెడ్డి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.