Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
చిరుధాన్యాల సాగును సేంద్రీయ పద్ధతిలో చేపట్టడంతో పర్యావరణ పరిర క్షణ, భూసార పరిరక్షణ గావించబడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఉషా ద యాళ్ అన్నారు. మండలంలోని రెడ్లవాడలో గురువారం వ్యవసాయ శాఖ అధ్వ ర్యంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరము 2023 కార్యక్రమంను సర్పంచ్ శ్రీలత ప్రసాద్‌తో కలిసి డిఏఓ కార్యక్రమంనుర్యాలితో ప్రారంభించారు. అనంత రం రైతు వేదికలో రైతులతో జరిగిన సమావేశంలో చిరుధాన్యాల సాగు, దిగుబడి, విత్తన రకాలపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు ముఖ్యంగా జొన్నలు, కొ ర్రలు, సామలు, రాగులు, సజ్జలు, అరికెలు, అండ్రుకొర్రలు, ఉదలు, వరిగులు విరి విగా సాగు చేసుకోవచ్చున్నారు. 70-120 రోజుల మధ్య పంటకాలం ఉంటుం దని దీంతో త్వరగా రైతుకు ఆదాయం వస్తుందన్నారు. ఈ పంటలు, భీడు భూ ములు, పనికిరాని ఖాళీగా ఉన్న నేలలో కూడా సాగు చేసుకోవచ్చని, చిరుధా న్యాల్లో ఐరన్, జింక్, పాస్ఫరస్, పోషకాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్థాలు ఆహార ధానాల్లో కంటే ఎక్కువ ఉంటాయన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసు కోవడం ద్వారా చక్కెర అదుపులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి రావుల శ్రీలతప్రసాద్, కేవికే మామునూర్ శాస్త్రవేత్త రాజు, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఎంపిటిసి మాలోతు రవి, కన్సల్టెంట్ సారంగపాణి, ఉపసర్పంచ్ బర్ల వీరభద్రయ్య, ఏఈవోలు రాజీవ్ లోచన్, రైతులు పాల్గొన్నారు.