Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
అర్హులైన నిరుపేదలకు పట్టాలివ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిలు క రాఘవులు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ నుండి తహసి ల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తాసిల్దార్ కార్యాలయం ముందు మం డలంలోని వివిధ గ్రామాలకు చెందిన పేదలు ధర్నా నిర్వహించారు.ఈ సంద ర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలన్నారు. ప్రభు త్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. రాజ కీయ నాయకులు ఎన్నికల ముందు అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూ మ్ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి,ఎన్నికైన తరువాత పట్టించుకున్న పాపాన పోలేద న్నారు. ఇప్పుడు నివేష స్థలం ఉన్న పేదలకు మూడు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకో వాలని చెబుతున్నారని రూ.3లక్షలతో పేదలు ఏ విధంగా ఇల్లు నిర్మించుకుంటా రని ప్రశ్నించారు. కనీసం ఐదు లక్షల అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం తెలంగాణ రైతు సంఘం హనుమకొండ జిల్లా కోశాధికారి బొల్లం సాంబరాజు మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం స్థానిక తహసిల్దార్ మర్కాల రజని గారికి డిమాండ్స్ తో కూడిన విన తి పత్రం అందించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలను కలెక్టర్ దష్టికి తీసుకుపోతామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లానాయకులు అంబాల స్వరూప ,ఈర్ల సురేందర్, సతీష్, ఆరూ రి భాగ్య, వెంకటయ్య,సరోజన,అంబాల మమత, అరుణ తదితరులు పాల్గొన్నారు.