Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-నెల్లికుదురు
దేశవ్యాప్తంగా 14 కోట్ల పైగా ఉన్న వ్యవసాయ కూలీలకు సమగ్ర వేతన చట్టం చేసి అమలకు పూను కోవాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపికేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముం జంపల్లి వీరన్న జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటేశ్వ ర్లు ప్రభుత్వాలపై డిమాండ్ చేశారు. మండల కేం ద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని గురువారం తహసిల్దార్ యోగేశ్వరరావుకు ప్రతి నిధి బృందంగా వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2021 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మం ది వ్యవసాయ కార్మికులు ఉన్నారని వారికిఒక వేతన చట్టంనేటికీ లేదని ఆవేదన వ్యక్తం చెందారు. 1948 మార్చి 15న కనీస వేతనాలు చట్టం చేసిన నేటికీ సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదంటే వ్యవసాయ కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. వ్యవసాయ కూలీలకు ప్రభుత్వ మిగులు భూములు దేవాదాయ ధర్మాదాయ భూదానోద్యమ భూములను పంచాలని గ్రామాలలో వ్యవసాయ కార్మికుల పేర్లు నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించా లని కోరారు. అర్హులైన వ్యవసాయ కార్మికుల కు ఇళ్ల స్థలాలుడబుల్ బెడ్రూమ్స్ ఇంటి నిర్మాణానికి అవసర మైన డబ్బు లు సహాయాన్ని ప్రభుత్వమే చేయాలన్నా రు. అదేవిధంగా వారందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ జీవితబీమా సౌకర్యం కల్పించి వారిని ఆదు కోవాలని కోరారు. జనవరి 17 నుంచి 24 వరకు మండల డివిజన్జిల్లా కేంద్రాలలో ఆందోళన నిర్వ హించాలని రాష్ట్ర జిల్లా కౌన్సిల్ పిలుపులో భాగంగా ఈకార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 40 రోజులు కూడా కూలీలకు పని ఇవ్వటం లేదని అన్నారు. సరైన వేతనం చెల్లించక కార్డుల ఏరువేత కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఈ పథకాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇరుగు అనిల్ తో పాటు వెంకన్న ఐలయ్య రాజు బీమా తదితరులు పాల్గొన్నారు.