Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 ఏళ్లుగా షటిల్ టోర్ని నిర్వహణ అభినందనీయం : డోర్నకల్ ఎమ్మెల్యే డి.రెడ్యానాయక్
నవతెలంగాణ-మరిపెడ
తెలంగాణ ఏర్పడ్డాకా మారు మూల పట్టణాలకు సైతం బారాసా ప్రభుత్వం సముచిత ప్రాదాన్యతను ఇస్తుందని, అందుకు ఈ ఆటిటోరియం, బ్యాట్ మింటన్ క్లబ్ ఉదాహరణ.. 14 ఏళ్లుగా జరుగుతున్న ఈ రాష్టాల స్థాయి షటిల్ టోర్నికి ఏటికేడాది ఆదరణ పెరుగుతుందని, అందుకోసంమే రూ.3కోట్లు వెచ్చించి ఇంత టినిర్మాణం అందుకు తగ్గట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు టోర్ని నిర్వహణ అభినందనీయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గురువారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని ఆడిటోరియం లో జరుగుతున్న తెలుగు రాష్టాల స్థాయి షటిల్ టోర్నమెంట్‌ను జిల్లా అదనపు కలె క్టర్ అభిలాషఅభినవ్, డోర్నకల్ యువనేత డీఎస్ రవిచంద్రతో కలసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివద్ధిలో భాగంగా నిర్మిం చిన ఈ ఆడిటోరియం నేడు ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. ఇతర రాష్టాల క్రీడాకారులకు ఆతిధ్యం ఇవ్వడమే కాకుండా మన ప్రాంతంలోని గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టోర్ని ఎంతగానో దోహదపడుతుం దన్నారు. శారీరక దారుడ్యానికి మానసిక వికాసానికి షటిల్ ఎంతగానో ఉపయో గపడుతుందని, ప్రతిఒక్కరు షటిల్ ఆటను తమ దైనందిన జీవితాల్లో ఓ భాగంగా చేసుకోవాలన్నారు. ఇక సొంతఖర్చులతో ఇంత పెద్ద టోర్నిని నిర్వహించటం అభి నందనీయమని, కరోన కాలంలో తప్ప మిగతా అన్ని సంవత్సరాలు మొదలు పెట్టి న నాటి నుంచి ఇప్పటి వరకు టోర్ని నిర్వహిస్తున్నందుకు నవీన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
చిన్న పట్టణం పెద్ద కట్టడం : కలెక్టర్ అభినవ్ అభిలాష
మారు మూల పట్టణం, కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీ ఇంత త్వరగా ఇంత పెద్ద ఆడిటోరియం నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉందని జిల్లా అదనపు కలెక్టర్ అభినవ్ అభిలాష అన్నారు. తన కింద ఉన్న మానుకోట, తొర్రుర్, డోర్నకల్, మరిపెడ మునిసిపాలిటీల్లోనే అత్యంత వేగంగా మానుకోట తర్వాత మరిపెడ శరవేగంగా అభివద్ది చెందుతుందన్నారు. ఈ షటిల్ టోర్నితో మరిపెడ పట్టణం గురించి రెండు తెలుగు రాష్టాలకు తెలియటం, అందులోనూ ఇంత మంచి కట్టడం నిర్మించుకోవటంతో పలువురు అభినందిస్తున్నారన్నారు. క్రీడాకారు లకు, క్రీడలకు ఇంత మంచి సౌకర్యాలు కల్పిస్తున్న గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నవీన్ రావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకాలు శక్తివంచన లేకుండా కషి చేస్తూ తమకు వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవలని ఆకాంక్షించారు.
చెట్టు నుంచి ఆడిటోరియానికి కృషి : రవి చంద్ర
సుమారు 14ఏళ్ల క్రితం అప్పటి ఎంపీపీ గుగులోత్ వెంకన్న ఆధ్వర్యంలో షటిల్‌పై మక్కువతో గుడిపూడి నవీన్ రావు ఎంపీపీ కార్యాయలంలో ఓ షటిల్ కోర్టు ఏర్పాటుచేసి అందులో టోర్నిలు నిర్వహించారని, నేడు డోర్నకల్ ప్రియతమ నేత రెడ్యానాయక్ చొరవతో ఇంతటి బ్యాట్మింటన్ క్లబ్ ఏర్పాటు చేసుకోవటం ఆనందంగా ఉందని డోర్నకల్ యువనేత రవిచంద్ర అన్నారు. ఫలితంగా మరిపెడ పట్టణానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని, నూతనంగా ఏర్పడినా అభివద్ధిలో దూసుకెళ్తుందన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభకు పదును పెట్టాలన్నారు. టోర్నిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ అభినవ్ అభిలాష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువనేత రవిచంద్ర, కుడితి మహేందర్ రెడ్డి షటిల్ ఆడారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్నాయకులు రామడుగు అచ్చుతరావు, కుడితి మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న, పీఎసీఎస్ చైర్మెన్ చాపల యాదగిరి రెడ్డి, మునిసిపల్ చైర్మెన్ గుగులోత్ సింధూర రవినాయక్, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, వైస్ చైర్మెన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అ ధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాళ్లపల్లి రఘు, గిరిపు రం పీవీఎన్ శాస్త్రి, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, ఎంపీడీవో ధన్సింగ్, ఎంపీవో పూర్ణచందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బారాసా నాయకుడు చందు, పట్టణ ఉపాధ్యక్షుడు అంబటి వెంకట్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు శ్రీను, రేఖ లలితా వెంకటేశ్వర్లు, మాచర్ల స్రవంతి బద్రయ్య, పానుగోతు సుజాత వెంకన్న, పద్మ కోటేష్, ఊరుగొండ శ్రీనివాస్, కిషన్, వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, హతిరాం, పరశురాములు, గందసిరి ఉపేంద్ర లింగమూర్తి, కౌసల్య గణేష్, కో ఆప్షన్లు ఉప్పల నాగేశ్వర్ రావు, మక్సూద్, ఖైరున్ హుస్సేన్, శ్రీలతా లక్ష్మినారాయణ, బారాసా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.