Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్ఘనపూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం, దేశ ప్రజలందరికీ కనువిప్పు లాంటిదని తొలి ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. నియోజక వర్గ కేంద్రంలో జీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, ఇప్పగూడెం గ్రామంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, చిల్పూర్ మండలంలో శ్రీపతిపల్లి గ్రామంలో బొమ్మిశెట్టి సరితాబాలరాజు హాజరై కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభించారు. కంటి పరీక్షలు వందశాతంపైగా నమోదయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ, అభివద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కంటి వెలుగుతో గిన్నిస్ రికార్డులో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రకు పరిచయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీఎస్, క్యుఎస్ జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణా కర్ రాజు, ఆర్డీఓ క్రిష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్‌కుమార్, తహసీల్ధార్ పూల్‌సింగ్, ఎంపీడీఓ క్రిష్ణ, ఎంపీఓ సుధీర్, సర్పంచ్ సురేష్, పర్శరాములు, ఎంపీటీసీ గండి విజయలక్ష్మి, గన్ను నర్సింహులు, రాజు, కో ఆర్డినేటర్లు శ్రీధర్ రావు, రంజిత్ రెడ్డి, వెంకన్న, శ్రీరాములు, పీఏసీఎస్ డైరెక్టర్లు సత్యం, యాకయ్య, ఎల్లాగౌడ్, హరీష్, దయాకర్, మహేష్, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.