Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలోని బొడ్రాయి వద్ద భవన నిర్మాణ తాపీ మేస్త్రి సంఘం ములుగు పట్టణ కమిటీని గురువారం ఎన్నుకున్నారు. సంఘం ములుగు పట్టణ అధ్యక్షుడిగా బొచ్చు అశోక్మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులను అన్ని రంగాలలో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ ఉపాధ్యక్షులు దేవళ్ళ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కందికొండ కుమారస్వామి, సహాయ కార్యదర్శిగా చల్లా లక్ష్మణ్, కోశాధి కారిగా ఎర్ర శంకర్, సలహాదారులుగా కురిమిళ్ళ రాజేందర్, ప్రచార కార్యదర్శిగా కావటి కుమార్, కార్యవర్గ సభ్యులుగా పైడిపాల కుమార్, రాయిని వాసు చల్లా ప్రసాద్, మాగంటి నరేష్, సుంచు సురేష్, వల్లెపు శ్రీను, భోగిని సదయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.