Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లింగాలఘనపురం : రాష్ట్రంలో అంధత్వం నిర్మూలనే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు నెల్లుట్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ విజయమనోహర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమాని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ అభివద్ధి కోసం రాజకీయాల కచ్చితంగా అధిక నిధులు కేటాయిస్తారని తెలిపారు. చివరి క్షణం వరకు ప్రజా జీవితానికే అంకితం అవుతానని అన్నారు. ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, సర్పంచ్లు గణపతి, శ్రీపాల్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి లత, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్ధార్ అంజ య్య, ఐకేపీ ఏపీఎం శంకరయ్య, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాగేందర్, జిల్లా దిశ కమిటీ సభ్యులు భాగ్యలక్ష్మి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీవారి, తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే
రఘునాథపల్లి : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమా న్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. గురువారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని కమిటీ హాల్ వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ పోకల శివకుమార్ గుప్త అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల సౌకర్యం కోసం మౌలిక వసతులు ఏర్పాట్లను పరిశీ లించి పలు సూచనలు చేశారు. రఘునాథపల్లి గ్రామ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని తెలిపారు.