Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్
నవతెలంగాణ- కాటారం
కంటి వెలుగు కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని, కంటి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినితో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని శ్రీధర్‌బాబు కోరారు. పల్లెల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడే పూర్తిస్థాయిలో వైద్యం అందుతుందని అన్నారు. డయాబెటిస్ విష యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఇబ్బందులకు గురవుతున్న వారిని గుర్తిం చి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో చికిత్సలు అందించాలని కోరారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటా యించి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయ వం తంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో అందరికీ చికిత్సలు అందించి సమస్యలు పరిష్కరిస్తామ న్నారు. కాటారం ఎంపీపీ పంతగాని సమ్మయ్య మాట్లా డుతూ... కాటారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక హాస్పిటల్‌గా గుర్తించాలని కోరారు. సర్పంచ్ తోట రాధమ్మ, ఎంపీటీసీలు మహేష్ రవీందర్రావు, జాడి మహేశ్వరి, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, వైద్యాధికారి మౌనిక, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు టి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్‌రావు, చీర్ల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వార్డు సభ్యులు కొట్టే శ్రీహరి, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం రాజబాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.