Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ సభ విజయవంతంతో సంజయ్, కిషన్‌రెడ్డి, రేవంత్‌కు పిచ్చిలేసింది : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన రాష్ట్రం కంటే ఎక్కువ అభివృద్ధి జరిగితే రాజీనామా చేయడానికి సిద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. గురువారం సాయంత్రం హన్మకొండ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాటాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మన్ననలు పొందారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎంతో మంది ముఖ్యమంత్రులు అభినం దించారన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు విమర్శలు చేయడం మానుకోవడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధ్యయనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మన రాష్ట్రం కంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధి జరిగితే రాజీనామాకు సిద్ధమని ప్రకటిం చినా బీజేపీ నేతలు ముందుకు రావడం లేదన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయ వంతం కావడంతో బండి సంజరు, కిషన్‌రెడ్డి, రేవం త్‌రెడ్డికి పిచ్చిలేసిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో వణుకుపుట్టిందన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఎంపీ అయి వుండి ఒక్క మంచి పనైనా కరీంనగర్లో చేసినవా ? అని బండి సంజరును ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు అభినందిస్తే, రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలకు అవి కనపడకపోవడం విచారకరమన్నారు. బీజేపీ నేతలు కేంద్రంలో ఉండి నిధులు ఇవ్వడం లేదన్నారు. అయినా సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి దళిత బంధు, రైతుబంధు, మిషన్ భగీరథ వంటి పథ కాలను అమలు చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో దేశంలో ఈ పథకాలను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ బహిరంగసభలో ప్రకటించారన్నారు. నేటికీ పలు గ్రామాల్లో కరెంటు, సాగునీరు లేకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ విభజన చట్టంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన సంస్థలను ఇవ్వలేదన్నారు. సంజయ్, కిషన్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని, గిరిజన విశ్వవి ద్యాలయం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలను తేవాలని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి తెలివితక్కువగా మాట్లాడుతున్నాడన్నారు. కర్నాటకలో మాజీ సీఎం కుమారస్వామి పాదయాత్ర ఉండడంతో బహిరంగ సభకు హాజరు కాలేక పోయారన్నారు. దేశంలో కాం గ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిపోతుందని, కాంగ్రెస్ ఉండాలని తాము కోరుకుంటుంటే, వారే నాశనం చేసుకుం టున్నారన్నారు. ఇకనైనా రేవంత్ పద్దతి మార్చుకోవా లని అన్నారు. ఖమ్మం సభను విజ యవంతం చేసిన ఖమ్మం, మహబూబాబాద్, సూర్యా పేట, భద్రాద్రి జిల్లాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ నేతలు కళ్లున్న కబోదులు : ఛీఫ్‌విప్
బీజేపీ, కాంగ్రెస్ నేతలు కళ్లున్న కబోదులని ఛీఫ్ విప్, బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినరుభాస్కర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి సీఎం అభివృద్ధి చేస్తున్నా అవేవి బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనిపిం చడం లేదన్నారు. ఆ నేతలు తమ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని పరీక్షించుకుంటే అభివృద్ధి కనపడుతుందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ కనుమరుగవుతుందన్నారు.
రిజర్వేషన్ల ఎత్తివేతకు బీజేపీ కుట్ర
: ఎమ్మెల్యే అరూరి రమేష్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆరోపించారు. ప్రధాని మోడీ అన్నిరంగాలను ప్రైవేటు పరం చేయడం వెనుక అదే కుట్ర దాగి ఉందన్నారు. ప్రయివేటుపరం చేసిన అన్ని సంస్థ లను తిరిగి ప్రభుత్వపరం చేస్తామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మం బహిరంగసభ విజయవం తమైతే బీజేపీ, కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతు న్నారన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, కుడా చైర్మెన్ సుందర్రాజ్ యాదవ్, గాంధీనాయక్, లలితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.