Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ గోదావరి ఆవర ణలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు నైపుణ్యత పరీక్ష నిర్వహించడం జరిగిం దని పిసా కో-ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూఈ రోజు తుపాకులగూడెం గ్రా మ పంచాయతీ పరిధిలోని తుపాకులగూడెం,గుట్టల గంగారం గ్రామ గిరిజనులతో మత్స్య సహకార సం ఘం ఏర్పాటు చేసి బ్యారేజ్ పైన గల గోదావరిలో చేపలు పట్టుకునే హక్కు కల్పించబడుతుందన్నారు. సొసైటీ ఏర్పాటుతో ఉచిత వలలు, చేపపిల్లలు, 70 శాతం రాయితీలతో, శీతలీకరణ యంత్రాలు, 5 లక్ష ల ప్రమాద భీమా లాంటి పథకాలు ప్రభుత్వం నుంచి అందుతాయన్నారు. ఏజెన్సీలో పిసా చట్టం లోని రూ ల్ 5 (10)డి ప్రకారంగా చేపలు పట్టే అవకాశం గిరి జనులకే ఉందన్నారు. ఈ రోజు 59 మందితో నిర్వహించిన నైపు ణ్యత పరీక్షలు వలలు విసరడం, తెప్పలపై ఈదడం, ఈత కొట్టడం, వలలు అల్లడం లాంటి పరీక్షలు నిర్వహించారు. ఆదివాసీలకు మత్స్య కార సంఘాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకా శం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోరంసూర్యనారాయణ,శ్రీపతి ములుగు జిల్లా మత్స్య అధికారి అవినాష్, భూపాలపల్లిజిల్లా అధికారి దుర్గం రమణయ్య, ఆత్మ చైర్మన్, జీసీసీ డైరెక్టర్ ఫుల్సం పురు షోత్తం, ఎంపీటీసీ నర్సక్క రాంబాబు, పొడెం బాబు తుడుందెబ్బ, బీజేపీ రామరాజు నేత, బీజేపీ మండల అధ్యక్షుడు కావిరి సంతోష్, సిబ్బంది మౌనిక, క్రిష్ణ, సొసైటీ సభ్యులు ఆలం భాస్కర్, కోరం సమ్మయ్య, పీర్ల శ్రీనివాస్, పీర్ల కేశవరావు, ఆలం సంతోష్, ఆలం నాగేశ్వరరావు, కోరం చందర్రావు పాల్గొన్నారు.