Authorization
Sat March 01, 2025 07:02:41 am
నవతెలంగాణ-లింగాలఘనపురం
విద్యార్థులు క్రీడల్లో క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ తమ నైపు ణ్యాన్ని ప్రదర్శించాలని పప్పు వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని వనపర్తి గ్రామ సమీపంలో పివిఆర్ పాఠశాలలో క్రీడా వారోత్సవాలు ఘ నంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల చైర్మన్ శ్రీలత రెడ్డి, సెక్రెటరీ పప్పు వెంకట్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పప్పు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా వారోత్సవాలు మూడు రోజులపాటు జరుగుతా యని, ఇండోర్, అవుట్డోర్ క్రీడలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని క్రమశిక్షణ తో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. క్రీడలు స్నేహ భావాన్ని పెం పొందించడానికి దోహదపడతాయని, క్రీడల వల్ల పోటీతత్వం పెరుగుతుందని త ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాకేష్, అశోక్, రమేష్, నరసయ్య, మంజుల పుష్ప లత రాధిక శ్రీలత విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను క్రీడాకారులను ఎంతగానో అలరించాయి.