Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ 11వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా కోరారు. శుక్రవారం జనగాం జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం కామ్రేడ్ షేక్ బందగి స్మారక స్తూపం వద్ద జాతీయ మహాసభల కరపత్రా లను పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా ఆవిష్కరిం చారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మాన్యపు బుజేందర్తో కలిసి మాట్లాడారు. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరుగుతున్నాయని, గత ఐదు సంవత్సరా లలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించు కొని, రానున్న ఐదేళ్ల కాలంలో చేయాల్సిన పోరాటాల ను, కార్యాచరణను ఈ మహాసభల్లో నిర్ణయించను న్నట్లు ఆయన తెలిపారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న మతోన్మాద, పెట్టుబడిదారి ఆర్ధిక విధానాలు సంక్షో భం వైపు నెట్టివేశాయని తెలిపారు. వీటి ఫలితంగా దేశం ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంద న్నారు. 10శాతం సంపన్నుల చేతుల్లో 50శాతం పైగా సంపద పేరుకుపోయిందని తెలిపారు. ప్రపం చ శతకోటీశ్వరులలో భారత్ మూడో స్థానంలో ఉం దని, తలసరి ఆదాయంలో 158 స్థానానికి పడిపో యిందని తెలిపారు. పెట్టుబడిదారుల సంపద పెరి గిపోవడానికి సామాన్యుల పరిస్థితి అగమ్య గోచరం గా మారటానికి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే కారణమని విమర్శించారు.8 ఏళ్లలో 11 లక్షల కోట్లు బడా పెట్టుబడిదారుల బ్యాంకు రుణాల ను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ప్రజాస్వా మ్యం ప్రమాదంలో పడిందని, లౌకికవాదం, సమాన త్వం, సామాజిక న్యాయం, సమైక్యస్ఫూర్తి తుంగలో తొక్కబడుతున్నాయని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సంస్థ లు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, మ తం పేరుతో ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డా రు. మతోన్మాద ఫాసిస్ట్ పన్నాగాలను తిప్పి కొట్టాల ని, ఫాసిజాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశ భవిష్యత్తుని అంధకా రం చేసే పాలకులని, ప్రభుత్వాలను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిత్యం సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకుపైగా పార్టీ విస్తరించిందని,బీహార్లో 12 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారని, జార్ఖండ్ రాష్ట్రం లోనూ ప్రాతినిధ్యం కలిగి ఉందని తెలిపారు. దేశంలో ఫాసిస్ట్ ప్రమాదం ఉంచుకొస్తున్న తరుణంలో మారు తున్న రాజకీయ సామాజిక పరిస్థితుల్లో అనుసరించా ల్సిన రాజకీయ ఎత్తుగడలను, భవిష్యత్తు కార్యాచరణ ను నిర్ణయించుకునేందుకు పార్టీ మహాసభలు జరుగుతున్నాయన్నారు.ఫిబ్రవరి 15న పాట్నా నగ రంలో సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా ర్యాలీ బహి రంగ సభను నిర్వహిస్తున్నామని, మహాసభలను విజ యవంతం చేయాలని, ప్రజా పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జీడి సోమయ్య, మండల నాయకులు చింత భాస్కర్ మహారాజ్, తూర్పాటి సారయ్య తదితరులు పాల్గొన్నారు.