Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండల కేంద్రంలో శుక్రవారం గొర్రెల మేకల పెంపకందారుల సం ఘం(జిఎంపిఎస్)మండల కమీటి ఆ ధ్వర్యంలో జిల్లా కమీటి క్యాలెండర్ను తాసిల్దార్ స్వప్న, డిటి సుమన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ మండలంలోని గొర్రెకాపరులు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కల రాజా బీర్, జిల్లా కమిటీ నెంబర్ బెల్లి అజరు, మండల అధ్యక్షులు కుక్కల రాజు, కార్య దర్శి జెల్లెల్ల రవీందర్, కత్తుల రాజు, కుక్కల రమేష్, కత్తుల బిక్షపతి, గద్ద కొము రయ్య, నక్క మల్లేష్, బండి రాజు, జల్లెల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.