Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లపు సుధాకర్ డి మాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ సెక్రెటరీ రాజేంద్రకు వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాకర్ మాట్లాడుతూ జిల్లా లో మిర్చి పండించిన రైతులు మిర్చి కొనుగోలు కేం ద్రం లేకపోవడంతో, చిల్లర వ్యాపారుల దగ్గర అమ్ము కోవడంతో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సుమారు 40 నుండి 50 దాకా చిల్లర కాంటాలు ఉండడంతో రైతులు అక్కడే అమ్ముకోవాల్సి వస్తుందని దీనివల్ల చాలా వరకు రైతులు మోసపోతు న్నారని అన్నారు. ఇప్పటికే రైతులు పెట్టుబడులు పెట్టలేక వడ్డీకి తీసుకువచ్చి ఒక వైపు మిర్చి పంటలు పండక పోవడంతో రైతుల ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. వెంటనే మార్కెట్ సెక్రటరీ గారు స్పందించి జిసిఎస్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించాలని డిమాండ్ చేశారు.