Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ డీపో కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తా
- పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టని అధికారులను సస్పెండ్ చేపిస్తాం
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-ఎటూర్నాగారంఐటీడీఏ
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంకి గొప్ప చరిత్ర ఉందని, దానిని మరింత అభివృద్ధి చేసేందు కు నిధులు మంజూరు చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి చిట్టిబాబు తల్లి ప్రమీలాదేవి దశదినకర్మ శుక్రవారం కావడంతో ఆకార్యక్రమానికి మంత్రి ఎర్ర బెల్లి హాజరయ్యారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబాన్ని ఓదార్చి ప్ర గాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం టీఆర్ ఎస్ జిల్లా నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఏటూరునాగారంలో రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు వారం రోజు ల్లో మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామన్నా రు. రూపాయలు కోటి గాని రెండు కోట్లు గాని నిధులు ఇస్తామని వాటితో పనులు పూర్తి చేయించా లని స్థానిక జెడ్పీ చైర్మన్ జగదీష్, ఎంపీపీ, సర్పంచ్ లను మంత్రి కోరారు. అదేవిధంగా ఏటూరునాగారా నికి ఆర్టీసీ డిపో వచ్చేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తా మన్నారు. ములుగులో ఆర్టీసీ బస్ డిపో పనులు ప్రా రంభించామని, ఏటూరునాగారంలో కూడా కావా లని తమ వంతుగా కృషి చేస్తామన్నారు. సీఎం కేస ీఆర్ వల్లనే ములుగు జిల్లా అయ్యిందని, మున్సిపా లిటి కూడా ములుగును చేయాలని ప్రతిపాదన పెట్టామని మంత్రి తెలిపారు.
పారిశుద్ద్య పనులు చేయడం లేదా..?
ఏటూరునాగారం రోడ్లు, కాల్వలు దుర్భరంగా ఉన్నాయని, పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదా అని స్థానిక ఎంపీఓ, ఇన్చార్జ్ ఎంపీడీఓ కుమార్, పంచా యతీ కార్యదర్శి అశోక్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సక్రమంగా లేవని, విధుల్లో నిర్లక్ష్యం ఉన్నందుకు సస్పెండ్ చేయాలని సంబంధిత అధి కారులను మంత్రి ఆదేశించారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ కూడా కీలక పాత్ర పోషించాలని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వెళ్లడిం చారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల పను లు ముందుకు సాగడం లేదని ఆయన మండిపడ్డా రు. ఆయన వెంట జెడ్పీ చైర్మన్ జగదీష్, ఎంపీపీ అం తటి విజయ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, జెడ్పీ కోఆ ప్షన్ సభ్యురాలు వలియాబీ, టీఆర్ఎస్ జిల్లా నాయ కుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, రైతు సమన్వసమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మండల పార్టీ అధ్య క్షుడు సునీల్‌కుమార్, వార్డు సభ్యురాలు కనకతార, టీఆర్ఎస్ నాయకులు తాహేర్, కృష్ణారెడ్డి, బాసానిశే ఖర్, పెండ్యాల ప్రభాకర్, ప్రదీప్‌బాబు, మెర్గు వెంక న్న, లక్ష్మణ్, యాదగిరి, మాజీ సర్పంచ్ చక్రంబాబు, ముత్తేష్, సర్పంచ్ జిట్ట ఈశ్వర్ పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి సమస్యలు...
వెంకటాపురం : తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఏటూరునాగారం మండలంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబల్లి దయాకర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భం గా వెంకటాపురం రాజకీయ పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వివిధ సమస్యలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమ స్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు.