Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం
- లక్ష రూపాయల ఆర్థిక సహాయం
- మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామం లో ఇటీవల గుండెపోటుతో ఆకస్మి కంగా మృతి చెందిన తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ కుటుంబాన్ని శుక్ర వారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో సామాన్య కార్యకర్తలతో సహా ఉద్యమకారులను ప్రతి ఒక్క రిని కష్టకాలంలో పార్టీ ఆదుకొని వెన్నంటి ఉంటుందని దయాకర్ రావు అన్నారు. మల్లికార్జున్ కుటుంబ పరిస్థితులను మంత్రి కేటీఆర్‌కు వివరించి పార్టీ పరంగా కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తనవంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లుప్రకటించారు.మల్లికార్జున్ కుమారు లలో ఒకరికి బీటెక్ ఇంజనీరింగ్ సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ములు గు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరా మర్శించారు. సొంత ఇల్లు లేదు అని తెలుపగా ములుగు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.గజ్జి మల్లికార్జున కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ములు గు జిల్లా గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి తుమ్మల హరిబాబు, మండల అధ్యక్షులు సురపనేని సాయికుమార్, ములుగు భూపాలపల్లి రైతు సమన్యాసమితి అధ్యక్షులు పల్లపుచ్చయ్య,ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పాపయ్య పల్లె సర్పంచ్ రాకేష్, గాంధీన గరం సర్పంచ్ భూక్య సుక్య, లౌడియ స్వాతి వాగ నాయక్, సీనియర్ నాయకులు టి ప్రసాద్, లకావత్ చందులాల్, ,సుమలత భూక్య, టి ప్రసాద్, పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి, వెంటపురం మండలం జడ్పిటిసి కె రుద్రమదేవి అశోక్, తాడువాయి మండలం సీనియర్ నాయకులు దిద్ది మోహన్ రావు, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి బాబర్, బిఆర్ఎస్ పార్టీ మండల సీని యర్ నాయకులు, ఉద్యమకారులు, పస్రా సీనియర్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.