Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐపీకేఎంఎస్ డిమాండ్
నవతెలంగాణ-బయ్యారం
అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) మండ ల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి, తహ సిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తాహసిల్దార్కు వినతిపత్రం అందజేయ డం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపా ధ్యక్షులు ఉమ్మగాని సత్యం మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన కేంద్ర శాసనాన్ని తీసుకురావాలని, కేంద్రం తో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర శాసనసత్వం చేసి అమలకు పూలుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మిగులు ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ భూములను వ్యవసాయ కార్మికులకు పంచాలని, గ్రామాల్లో రిజిస్టర్ ద్వారా వ్యవసాయ కార్మికుల పేర్లు నమోదుచేసి గుర్తింపుకార్డులు ఇవ్వాలని పేర్కొ న్నారు. పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు సంక్షేమానికి ప్రత్యే క లేబర్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికు లకు ట్రేడ్ యూనియన్ హక్కులు కల్పించాలని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యవసాయ కార్మికునికి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వ్యవసాయ కార్మికు ని కుటుంబాలలో పని చేస్తున్న వారందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే ఇవ్వా లని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిం చి వారి కుటుంబాలకు పూర్తి వైద్య సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులుపూణెం ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆవుల కట్టయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కత్తి అశోక్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మండల కార్యదర్శి బిల్లా కంటి సూర్యం, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల యాకయ్య, వెంకన్న, గుడిమెట్ల శ్రీను, కొంగ భద్రయ్య, ఎస్.కె జానీ, పివైఎల్ జిల్లా కార్యదర్శి పైన యాకయ్య, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి కె.భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.