Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు అందచేయాలని 2వ విడత కంటివెలుగు కార్యక్రమం ఏర్పాటు చేయడంజరిగిందని, ప్రతి ఒక్క రు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలె క్టర్ శశాంక ప్రజలను కోరారు. శుక్రవారం కలెక్టర్ మరిపెడ, కురవి మండలాలలో పర్యటించి కంటి వె లుగు కార్యక్రమాన్ని స్వయంగా సందర్శించి పర్యవే క్షించారు. ముందుగా మరిపెడ మండలంలోని గిరి పురం గ్రామంలో పర్యటించి రైతువేదికలో నిర్వహి స్తున్న కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లను పరిశీలించా రు. కంటి వెలుగు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నా రు. ప్రధానంగా వైద్య సిబ్బందికి నిర్ధేశించిన విధంగా ఉదయం 8.30 గంటలకు కేంద్రంలో సిద్ధంగా ఉం డాలన్నారు. సమయం తప్పనిసరిగా పాటించాలని ఎక్కువగా వృద్ధులు వస్తున్నందున నిల్చోనీయకుండా కుర్చీలు వేసి కూర్చో పెట్టాలని పేర్లను నమోదు చేసు కొంటూ వరుస క్రమంలో పిలుస్తూ పరీక్షలు నిర్వ హించాలన్నారు. ప్రతి ఇంటికి సిబ్బందిని పంపించి పరీక్ష కేంద్రానికి వచ్చే విధంగా అవగాహన పరచాల న్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కంటి పరీ క్షలు 18 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయుంచుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించరాదన్నారు. సుమారు 5నుండి10వేల ఖర్చు తో కూడిన ఖరీదైన వైద్యం అయినందున నిరుపేద లకు ఆర్ధిక భారం కాకుండా ఉచితంగా అందించా లనే లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలు చేయిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ద తీసు కుంటున్నట్లు కలెక్టర్ ప్రజలకు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా ప్రత్యేకంగా వృద్ధులను ఓపికతో పరీ క్షించాలని, సంతృప్తి చెందే విధంగా పరీక్షలు నిర్వ హించి ప్రజల మన్నలను పొందాలన్నారు. అనంత రం కురవి మండలంలోని కందికొండ గ్రామంలోని గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి కంటి పరీక్షల నిర్వహణ తీరును వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కంటి పరీక్షలు చేయించు కునేల ప్రోత్సహించాలన్నారు. సిబ్బంది స్థానికంగా ఉండేందుకు కావలసిన భోజన వసతి సదుపాయా లను సమకూరుస్తామన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కంటి వెలుగు కార్యక్ర మాన్ని చేపట్టి కంటి పరీక్షలను వందశాతం చేస్తూ విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్ర మంలో మరిపెడ, కురవి ఉప వైద్యాధికారులు ముర ళీధర్, ఉమా గౌరీ, ఎంపీడిఓలు ధన్సింగ్, సరస్వతి, తహశీల్దార్లు రాంప్రసాద్, ఇమ్మనియేల్ ప్రజాప్రతి నిధులు, డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరం సందర్శించిన
జిల్లా జడ్పీ చైర్మన్ బిందు నాయక్
నవతెలంగాణ-బయ్యారం
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామపంచా యతీలోని లక్ష్మిపురం గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు శిబిరంను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్ సందర్శించారు. ఈ సంధర్భంగా శిబిరంలో ఏర్పాటు చేసిన వసతులు, సౌకర్యాల పై ఎంపిడిఓను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించా లని, కంటికి సంబంధించి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని శిబిరానికి తరలించి చికిత్స అందించాలని, శిబిరంలో అన్ని వసతులు కల్పించి ఎవరికి ఏ ఇబ్బం ది రాకుండా చూడాలని ఎంపిడివో, సర్పంచులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్తీ కష్ణవేణి, బీఆర్ఎస్ నాయకులు బానోత్ మంత్రియ, ఎంపిడిఓ బి.వి చలపతి రావు, డాక్టర్ రామరాజు, ఆప్తోలోమిస్ట్ అశోక్, డి.ఓ కరుణ, సూపర్వైజర్ చైత న్య, సిహెచ్ఓ కళావతి, పంచాయతీ కార్యదర్శులు మోతీలాల్, భూక్యా సుధీర్, వైద్య సిబ్బంది, ఆశా వర్క ర్లు, ఐకేపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.