Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముల్ల పొదల తొలగింపు - రహదారి వెంట హెచ్చరిక బోర్డులు
- నార్త్ రేంజ్ అధికారి స్వర్ణ బాలరాజు
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన ట్లు అటవీ శాఖ నార్త్ రేంజ్ అధికారి స్వర్ణ బాలరాజు శుక్ర వారం తెలిపారు. అడవుల్లో జంతువులు సంచరించే ప్రాం తాలు, రహదారుల వెంట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు రోడ్లపై పడేసిన ప్లాస్టిక్ కవర్స్, బాటిల్లను సేకరించడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.రహదారివెంట ప్రయా ణికులకు ఇబ్బందులు కలవకుండా రహదారిపై వచ్చిన ముళ్ళకంపలను, చెట్ల తీగ లను తొలగిస్తున్నట్లు తెలిపారు .అదే విధంగా రహదారి వెంట కోతుల సంఖ్య ఎక్కు వగా ఉన్నందున ప్రయాణికులు వాటికోసం ఆహార ధాన్యాలను ఎక్కడప డితే అక్కడ వేయకుండా ప్రత్యేకంగా వాటికోసం ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. కొంతమంది ప్రత్యేక సిబ్బందిని ఈ పనుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరికి అటవీశాఖ ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలి పారు. అదేవిధంగా చెక్పోస్ట్ వద్ద ఇసుక లారీల నుండి రూపాయలు 200, ప్రైవే ట్ వాహనాల వద్ద 50 రూపాయలు, వసూలు చేసి అట్టి నిధులను అటవీ శాఖకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో అటవీశాఖ పరిధిలో పనిచేస్తున్న దినసరి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుండి మేడారం మినీ జాతర మొదలుకానుండడంతో భక్తులు పాల్గొని అడవిని కలుషితం చేసే అవకాశాలు ఉన్నాయని, దానికిగాను ఒక వంట పొయ్యికి 50 రూ పాయలు చొప్పున వసూలు చేసి అట్టి డబ్బులను పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వను న్నట్లు తెలిపారు. రానున్న రోజులలో అటవీ శాఖ అభివృద్ధి కోసం అనేక ప్రణాళిక లు చేపడుతున్నట్లు రేంజర్ బాలరాజు తెలిపారు.