Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-గణపురం
ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా డని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు. శుక్రవారం మండలం లోని రంగారావుపల్లి. సీతారాంపురం. అప్ప య్యపల్లి. బుర్రకాయలగూడెం గ్రామాలలో 75 లక్షల రూపాయలతో నూతన గ్రామపంచాయతీ భవనాలకు, అంతర్గత సిసి రోడ్లకు శంకు స్థాపన చేశారు. అనంతరం26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను,9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్. చెక్కులను, మొత్తం రూ.29,99,016 లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.సీఎం కేసీఆర్గ్రామాల సమగ్రాభి వద్దే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని గ్రామాలలోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టణాలకు దీటుగా అభివద్ధి చెం దాలని లక్ష్యంతో చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ భవనాలకు అంతర్గత సిసి రోడ్లకు నిధులు కేటాయిస్తు న్నారని అన్నారు. దేశంలోనే పేదింటి ఆడబిడ్డ పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.100116 అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభు త్వం అన్నారు. గ్రామాలలోని ప్రజలు సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం అప్పయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏ ర్పాటు చేసిన సిఎస్సి సెంటర్ ను సందర్శించి, గ్రామ ప్రజలకు మంచి సర్వీసు లను అందించాలని..నిరుద్యోగ యువత ప్రభుత్వ జాబ్ రాలేదని బాధపడకుండా, స్వయం ఉపాధి వైపు ప్రయత్నించి, పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మామిడి రవి. రామంచ భద్రయ్య. ఐలోని శశిరేఖా రామచంద్ర రెడ్డి. కాలియా రజిత బాబు. ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి .టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహారావు. తహసిల్దార్ సతీష్ కుమార్. గ్రామ కమిటీ అధ్యక్షుడు వైనాల వెంకటేష్. కాళ్ల రంగయ్య .బొబ్బల సాంబయ్య పాల్గొన్నారు.
పోలీస్ పహారా మధ్య బుర్రకాయల గూడెం జీపీ నిర్మాణానికి భూమి పూజ
పోలీసుల పహారా మధ్య బుర్రకాయల గూడెం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.చెశారు. ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయగా బుర్రకాయల గూడెం గ్రామానికి మంజూరు అయింది. ఈ క్రమంలో సర్పంచ్ కాళీయ రజిత బాబు. గురువారం శంకుస్థాపన కోసం పనులు చేస్తుండగా ఎంపిటిసి కాలియాసాగర్. మరో నలుగురు కలిసి ఈ భూమి తమదని దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రెస్టేజ్ గా తీసుకొని శుక్రవారం పోలీస్ బందోబస్తు మధ్య గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులకు పలు హామీలు ఇచ్చారు. త్వరగా ఈ భవనాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాలియా రజిత బాబు, నారగాని దేవేందర్ గౌడ్, పొట్ల నగేష్, మధుసూదన్ రావు, ఎంపీటీసీ శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో అరుంధతి, వైస్ ఎంపీపీ అశోక్, కో-ఆప్షన్ చోటేమియా, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహారావు, నాయకులు మోతె కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.