Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో ఓటరు జాబితా లో ఉన్న ఫోటో సిమిలర్ ఎంట్రీస్ (పి.ఎస్.ఈ) త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో జాతీయ ఓటర్ దినోత్సవం, పి.ఎస్.ఈ ఎంట్రీ ధవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ ఐ.డి. తో ఆధార్ అనుసంధానం ప్రక్రియ పై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా
ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, జనవరి 25 న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రతి జిల్లాలో ఎన్నికల కమిషన్ చే జారీ చేసిన సాంగ్ ను మైక్ ల ద్వారా వినిపించిన అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించాలని,80 సంవత్సారాలు వయస్సు పైబడిన ఓటర్ లను, నూతన ఓటర్ లను సన్మానించుకోవాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ అందించే ఓటరు పాటను స్థానిక కేబుల్ చానెళ్లలో, సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని సూచించారు. ఈ సంవత్సరం ఓటరు దినోత్సవం యొక్క థీమ్ లినథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షఉ్యర్లి దీని ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ లో సైతం ఓటరు దినోత్సవం వేడుకలను నిర్వహించి ప్రతిజ్ఞ చేయించాలని ఆయన సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ లింకేజ్ అనుసంధానం ప్రశంసనీయంగా ఉన్నదని, అర్బన్ ప్రాంతంలో ప్రణాళిక రూపొందించుకొని ఆధార్ లింకేజ్ ఎక్కువగా చేయాలనీ అధికారులను ఆయన సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 వేల పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 12 లక్షల పి.ఎస్.ఈ ఎంట్రీలను బూత్ స్థాయి అధికారులు వంద శాతం రాబోయే 15 రోజుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ, విజయవంతం అయ్యే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. రెండు చోట్ల ఓటరు నమోదు ఉన్న 12 లక్షల కేసుల్లో దాదాపు 80 శాతం మేర ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే సమయంలో సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.
జిల్లాలో నూతనంగా ఓటరు నమోదు చేసిన అభ్యర్థులకు ఓటరు కార్డులు పోస్టల్ శాఖ ద్వారా ఓటర్లకు చేరే విధంగా జిల్లా స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో పి.ఎస్.ఈ ఎంట్రీ పరిష్కారం కోసం 100శాతం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఆధార్ లింక్ పూర్తి చేస్తామని, నూతన ఓటరు కార్డు పంపిణీ పోస్టల్ ద్వారా పూర్తి చేస్తామని, ఓటరు దినోత్సవం వేడుకలను సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ వీడియో సమావేశంలో ఎలక్షన్ సిబ్బంది అబ్బాస్, నవీన్ , తదితరులు పాల్గొన్నారు.