Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
వినియోగదారులపై బారాల మోపే రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు డిమాండ్ చేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో జరిగిన సిపిఎం నాయకులు సమావేశానికి సిపిఎం జిల్లా నాయకులు,కే.రాజయ్య అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ
ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలను పెంచుకోవచ్చని, ఈ పెంపుదలకు రెగ్యులరేటరీ కమిషన్ అనుమతులు అవసరం లేదని తెలుపుతూ డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డిస్కాంలు)లకు విద్యుత్ నియంత్రణ మండలి స్వేచ్ఛ కల్పించడం పట్ల సీపీఐ(ఎం) జిల్లా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్నారు. విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపే ఈ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ, తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2018 నుండి 2022 వరకు రెగ్యులేటరీ కమిషన్ టారీఫ్ నిర్ణయించలేదు. డిస్కాంలు ఎలాంటి టారీఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదని, గత నాలుగేళ్ల బాకీలు రు.33వేల కోట్ల వసూళ్లకు 2022-23లో టారీఫ్ ప్రతిపాదనలో ఎలాంటి సూచనలు లేవన్నారు. రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండానే డిస్కాంలు గత సంవత్సరం ''డెవలప్మెంట్ ఛార్జీలు'' పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు వేసి వేల కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.డిస్కాంలు అంతర్గత సామర్థ్యం పెంచుకోకుండా వినియోగదారులపై భారాలు వేస్తున్నాయని, నేటికీ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం బొగ్గు, గ్యాస్, నీరు తదితర ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు వాటికి అనుగుణంగా ఛార్జీలను పెంచాలని డిస్కాంలు దరఖాస్తులు పెట్టుకుంటే రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణ జరిపి ముడిసరుకుల ధరలకనుగుణంగా ఛార్జీలను నిర్ణయించాలన్నారు. ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయని డిస్కాంలు తప్పుడు లెక్కలు చూపించి వినియోగదారుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు డిస్కాంలు ''ఫ్యూయల్ సర్ ఛార్జీలు'' ఎప్పటికప్పుడు వసూలు చేసుకోవాలని గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు.2023 ఫిబ్రవరిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ ఉన్నందున, జనవరి 30లోపు విద్యుత్ ఛార్జీల పెంపుపై డిస్కాంల ప్రతిపాదనలపై అభ్యంతరాలను తెలియజేయాలని రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించిందని, ఫిబ్రవరిలో జరిగే బహిరంగ విచారణలో టారీఫ్‌లు నిర్ణయించే వరకు వినియోగదారుల నుండి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని, రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అక్రమ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకుని
వినియోగదారులపై భారాలు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్, పి.రాజేందర్, డి.కిరణ్, పార్టీ నాయకులు వి.రాజయ్య, రజాక్, కిట్టు, రఫీ తదితరులు పాల్గొన్నారు.