Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్
నవతెలంగాణ-ములుగు
అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, టీచ ర్లు, హేతువాదులు, నాస్తికులపై రాష్ట్రంలో మతోన్మా దుల మూకదాడులను అరికట్టాలని, దుండగులను చట్టప్రకారం శిక్షించాలని, బాధితులపై పెట్టిన అక్ర మ కేసులను ఎత్తి వేయాలని స్వేచ్ఛ ములుగు జిల్లా జాక్ సభ్యులు కొండగోర్ల రాజేష్ ఆధ్వర్యంలో సోమ వారం అంబేద్కర్ విగ్రహం ఆవరణంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ మానవ హారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా వచ్చేసిన జేఏసీ చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిం చిన హక్కు దానిని కాపాడుకోవడం పౌరులందరి బా ధ్యత ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేకంగా లేదా చట్ట విరుద్ధంగా మాట్లాడిన ప్రవర్తించిన చట్ట ప్రకారం చ ర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతి లోకి తీసుకోకూడదన్నారు. ఎవరు ఎవరిపైన దాడుల కు పాల్పడరాదని, తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలని ఆరాటపడు తున్న మతోన్మాద అర్ఎస్ఎస్ రాజకీయ శక్తులు ఆడు తున్న రాజకీయ వికత క్రీడనే నేడు అభ్యుదయవాదు లు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, నాస్తికులు, బహుజనులపై జరుగుతున్న ఈ దాడులు మహారా ష్ట్రలో డాక్టర్ నరేంద్ర దభోల్కర్,డాక్టర్ గోవింద్ పన్సా రే, కర్నాటకలో ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి, గౌరి లంకే ష్ల హత్యలతో ఆడిన రాజకీయ వికృత క్రీడను నేడు తెలంగాణలో ఈమూకదాడులు హేతువాదం, నాస్తిక త్వం,భౌతికవాదం చార్వాకులు లోకాయతులు, బుద్ధు డి నుండి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్‌లు అందించి న భారతీయ తాత్వికవారసత్వం మానవ మనుగడకు పురోగమనానికి మూలం ప్రశ్నించే తత్వం ప్రశ్న లేక పోతే మానవ ప్రగతి లేదన్నారు. నేడు ఆ ప్రశ్ననే దాడులకు గురవుతున్నది. హత్య చేయబడుతున్నది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను గుర్తు ఎరిగిన ప్రజాతంత్ర వాదులం, వివిధ రాజకీయ పార్టీ లు, ప్రజా, పౌర సంస్థల రాజ్యాంగ హక్కులను కాపా డుకోవడానికి కలిసి ఐక్యంగాకృషి చేయడానికి స్వేచ్ఛ జాక్ ఏర్పడిందని ఇందుకోసం రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా మా కార్యాచరణ ఉంటుందన్నారు. ఎవరు మాట్లాడిన వాటిల్లోనైనా ఏవైనా చట్ట వ్యతిరే కంగా ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానాల తీర్పు ప్రకారం వ్యవహరించాలని, దా నికి విరుద్ధంగా దాడులకు పాల్పడడం చట్ట వ్యతిరేక మే కాక రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. ఎన్నో ఏళ్లుగా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్న బైరి నరేష్ పై, పాటలు పాడుతున్న రేంజర్ల రాజేష్ పై మతోన్మాదం, మనువాదం దాడులను చేస్తున్నదని, నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని కోటగిరి గ్రామంలో పాఠ శాలలో పనిచేస్తున్న దళిత టీచర్ మల్లికార్జున్‌ను అ త్యంత దారుణంగా అవమానించి, తన నమ్మకాలకు విరుద్ధంగా గుడిలోకి తీసుకెళ్లి బలవంతంగా క్షమా పణలు చెప్పించి బొట్టుపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ప్రభు త్వం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రొఫెసర్ సూరే పల్లి సుజాత,పిఓ డబ్ల్యూ సంధ్య, మహిళా, ట్రాన్స్ జెండర్ల సంఘాల ఐక్యవేదిక నాయకురాలు సజయ, సామాజిక కార్యకర్త దేవి, తదితరులపై బూతులతో మతోన్మాదులు చేస్తున్న దాడులను అరికట్టాలన్నారు. ఫేస్ బుక్‌లో పోస్టులు పెట్టినందుకు, వాట్సాప్‌లో చర్చలు చేసినందుకు, వాట్సాప్ పర్సనల్ స్టేటస్ పెట్టుకున్న అనేక మందిని బెదిరిస్తూ వారి ఇండ్ల దగ్గరకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఇటీవల మహ బూబ్‌నగర్ బూత్పూర్ ఎస్ఐ బాధితుడి పైనే కేసు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు కు విరుద్ధంగా తానే తీర్పులు చెప్పే విధంగా వ్యవహరించి అరాచకశక్తులను రెచ్చ గొట్టి దాడులకు పాల్పడేలా చేసిన మీడియాపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, టీచ ర్లు, భౌతిక వాదులు, వైజ్ఞానికప్రచారకులు, హేతువా దులు, నాస్తికులపై రాష్ట్రంలో అర్ఎస్ఎస్ మతోన్మా దుల మూకదాడులను అరికట్టాలని, దుండగులను చట్టప్రకారం శిక్షించాలని,బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని,స్వేచ్ఛ జాక్ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జంపాల రవీందర ఎమ్మె స్పి జిల్లా నాయకులు ఇరుగుపైడి, నెమలి నరసయ్య, జన్ను రవి, వావిలాల స్వామి, గోపి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయ కులు పుల్లూరి కరుణాకర్, వావిలాల చంతన్, ఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి, జిల్లా ఉపాధ్యక్షుడు సాదు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.