Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజెన్సీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి-జెడ్పీటీసీ తల్లడి పుష్పలత
నవతెలంగాణ-వాజేడు
షెడ్యూల్ ప్రాంతంలో 1/70, పిసా చట్టాలను వున్నప్పటికీ వాజేడు మండ లంలో చట్టాలను తుంగలో తొక్కి సహజ వనరులను అక్రమార్కులు అక్రమంగా అమ్ముకుంటున్నారని, మట్టి మాఫియా అక్రమమట్టి తవ్వకాలు జరిపి లక్షల రూపా యలు సొమ్ము చేసుకుంటున్నారని, చట్టాలను అమలుచేసి అక్రమ వ్యాపారాలను అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని వాజే డు జడ్పీటీసీ తల్లడి పుష్పలత అన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, తక్షణమే అక్రమ మట్టి తవ్వకాలు నిలిపి వేయాలని సోమ వారం వాజేడు తాహసిల్దార్ గూడూరి లక్ష్మణ్‌కి వినతి పత్రం అందజేశారు.