Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ పట్టణంలో హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు
నవతెలంగాణ-జనగామ
నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించని హౌటల్స్ రెస్టారెం ట్ల నిర్వహణ యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఆఫీసర్ స్వాతీ, డాక్టర్ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం జనగా మ పట్టణంలోని పలు రెస్టారెంట్లు హౌటల్స్ పై అకస్మికంగా తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారము ప్రతీ రెస్టారెంట్ లైసెన్స్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవా లన్నారు.ప్రజలకు అందించే ఆహారంలో పక్కగా నాణ్యత ప్రమాణాలు పాటించాల న్నారు. నగరంలోని కొత్తగా ఏర్పడ్డ కొన్ని రెస్టారెంట్లలో ఎలాంటి అనుమతులు, ఫుడ్సేఫ్టీ సర్టిఫికెట్స్, లైసెన్స్ లేకుండా కొనసాగిస్తున్నారని వాటికి ప్రభుత్వ పరం గా నోటీసులు జారీ చేసి లైసెన్సులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అందిం చే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఈ సంద ర్భంగా వారు వ్యాపారులను రెస్టారెంట్ నిర్వాహకులను ఆదేశించారు.