Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ రామ్ జ్యోతిర్మయి
నవతెలంగాణ-పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని జడ్పిటిసి శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, సర్పంచ్ కేతిరెడ్డి దీపిక సోమనరసింహారెడ్డి అన్నారు. సోమవారం బొమ్మకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 7 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతుందన్నారు. మన ఊరు మనబడి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బోనోత్ రవీందర్ నాయక్, జటోత్ నెహ్రు నాయక్, మాజీ ఎంపీటీసీ వెంకట్రామయ్య, ఎస్ఎంసి చైర్మన్ కుర్ర సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గంగాధర్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు రెహమాన్ సానియ్య, ఎర్రసాని రామ్మూర్తి, కళ్యాణి, పొడిశెట్టి సమ్మయ్య, గంగారపు మధు, దంతాలపెళ్లి రేణుక, సోమేశ్వర్ పాల్గొన్నారు.