Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ భూమి కాదు.. మా పట్టా భూములు రైతుల వెల్లడి
- బయ్యక్కపేట రైతులు మంత్రి సత్యవతికి వినతి
నవతెలంగాణ-తాడ్వాయి
మాభూమి మాకు ఇప్పించాలని బయ్యక్కపేట గ్రామానికి చెందిన రైతులు గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు విన్నవించుకున్నా రు.సోమవారం మేడారం మినీ జాతర రివ్యూ మీటిం గ్‌కు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు బయ్యక్క పేట రైతులు, స్థానిక సర్పంచ్ గుర్రం రమా సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. మంత్రి సత్యవతి రా థోడ్ వెంటనే స్పందించి సంబంధిత ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్యకు సమస్య పరిష్కరించాలని సూ చించారు. కలెక్టర్ వెంటనే స్పందించి బయ్యక్కపేట గ్రామంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా సమస్యను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బయ్యక్క పేట సర్పంచ్ గుర్రం రామసమ్మిరెడ్డి, రైతులు మాట్లా డుతూ బయ్యక్కపేట శివారులోని 126వ సర్వేనెంబ ర్ గల 108 ఎకరాల భూమిని 30 కుటుంబాలకు చెందిన 80 మంది రైతులము, మేము గతంలో 1968వ సంవత్సరం నుండి సాగు చేసుకుంటున్నా మని, అప్పటి నుండే మా భూములకు పట్టాలు ఉన్నా యని అన్నారు. ఈ భూములపై కేసీఆర్ పట్టాలు కూడా వచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబంధు కూడా పొందుతున్నామని, అందులో కొంత భూమిని మా కూతుళ్ళ వివాహానికి పసుపు కుంకుల కింద కానుకలు కూడా ఇచ్చామని ఆవేదన చెందారు. ఇలాంటి ఈ భూమిని సుమారు 60 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఫారెస్ట్ అధికారు లు మా భూములని రైతులను నానా ఇబ్బంది గురి చేస్తున్నారని మండిపడ్డారు. మా భూములను అన్యా యంగా, అక్రమంగా మా ఫారెస్ట్ భూములు అని ఇ బ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇట్టి విషయాన్ని ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగ దీష్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లామని, మా గోడు ఆలకించి, పరిశీలించి, మా కు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. న్యా యం జరగకపోతే మాకు సావే శరణ్యమని విన్నవిం చారు. ఈ కార్యక్రమంలో బయ్యక్కపేట రైతులు తదితరులు పాల్గొన్నారు.