Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రంథాలయ సేవలను పాఠకుల చెంతకు తీసు కెళ్లి కార్యకలాపాలను మరింతగా విస్తరింప చేస్తామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావ్ స్ప ష్టం చేశారు.సోమవారం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న జిల్లా గ్రంథాలయ భవనంలో జిల్లా గ్రంధాలయ సర్వసభ్య సమావేశాన్ని సంస్థ చైర్మన్ కమిటీ సభ్యులతో సమా వేశమై కార్యకలాపాలను సమీక్షించారు.ఈ సందర్భం గా చైర్మన్ మాట్లాడుతూ గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని దినదిన ప్రవర్ధమానంగా విలసిల్లు తున్నందున ఈ సదావకాశాలను ప్రజలు వినియో గించుకోవాలన్నారు.పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతు న్న యువత కోరిక మేరకు ఉదయం ఎనిమిది గంట ల నుండి ప్రారంభమై గ్రంథాలయంను ఏడున్నర గంటలకే ప్రారంభింపజేస్తామని అలాగే రాత్రి 9 గం టలకు ముగింపు వేళలను 10 గంటల వరకు కొనసా గిస్తామన్నారు.గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేం దుకు చర్యలు తీసుకుంటున్నామని నిశ్శబ్దాన్ని పాటి స్తూ పాఠకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కు కావలసిన పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటు లో ఉంచామని వినియోగించుకోవాలని కోరారు అదే విధంగా చిన్నారులకు కూడా వినోదాన్ని కలిగిచ్చే వి జ్ఞానాన్ని అందించే పుస్తకాలను ఏర్పాటు చేయనున్నా మని తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్ సామాజిక సేవ స భ్యులు పెద్ది సైదులు గ్రంథాలయ సెక్రటరీ శ్రీలత వి ద్యాశాఖ అధికారి శ్రీరాములు పౌర సంబంధాల అధి కారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.