Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
యువత స్వయం ఉపాధితో ఎదగాలని రాష్ట్ర తొలి ఉపముఖ్య మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నా రు. నియోజక వర్గ కేంద్రంలో నిర్వహకులు మారేడుపాక మోహన్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లైవుడ్, హార్డ్వేర్ దుకాణం ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సరైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నేటి యువత ఉద్యోగాలు వచ్చే వరకు తల్లిదండ్రులకు భారం కాకుండా, తమ కాళ్లపై నిలబడడానికి కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి యువతను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్ సురేష్కుమార్,మాజీ సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, బంగ్లా శ్రీనివాస్, ఎంపిటిసి గన్ను నర్సింహులు, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, యూత్ నాయకులు ఇల్లందుల నరేష్, మాతంగి దేవ య్య, మారేపల్లి ప్రసాద్ బాబు, దిగోజు నర్సింహచారి, సాంబచారి, ఆయిల సోమ నర్సయ్య, అశోక్, కిషోర్, శంకర్, రాజు, పొన్న శ్రీను, వెంకటేష్, సతీష్, పృధ్వీ రామ్, కన్నా, తదితరులు పాల్గొన్నారు.