Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతంతమాత్రమే హాజరైన ప్రజాప్రతినిధులు
- జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీరు మిషన్ భగీర థ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడిరాకుండా ఇప్పటినుంచే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, తగు చర్యలు తీసుకోవాలని జెడ్పీ స్టాండింగ్ కమిటీఛైర్మన్ మారపాకరవి సూచిం చారు. సోమవారం మండల సర్వ సభ్య సమావేశం ఎంపిపి కందుల రేఖ అధ్యకతన జరిగింది. సమావే శం మొదలు వ్యవసాయ శాఖతో ప్రారంభమయింది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు కేవలం మన నియోజక వర్గానికి ఎమ్మెల్యే రాజయ్య చొరవ తో సబ్సిడీ కింద బోర్, మోటార్ కలిపి ఒకలక్షా ఇస్త మని అనడం సంతోషమైనప్పటికీ, ప్రస్తుతం అధిక వ్యయంతో కూడినదని, రెండు లక్షలు మంజూరు కోరుతూ మండల సభలో తీర్మానం చేశారు. అలాగే ఎస్సీ నిరుద్యోగ యువత డిగ్రీ పాసై, గ్రూప్ 1, 2లకు గానూ ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రతి నిధులు తమ గ్రామాల్లో ప్రచారం చేయాలని అన్నా రు. మిషన్ భగీరథ పథకం అమలులో ప్రజా ప్రతిని ధులు, అధికారులు సమన్వయంతోముందుకు సాగా లని అన్నారు. మన ఊరు, మన బడి పనులు త్వరిత గతిన పూర్తి అయ్యోలా ఏఈ జాగ్రత్త వహించాలని అన్నారు. మిషన్ భగీరథ పథకం అమలులో ఏలాం టి సమస్యలున్నా తక్షణమే చర్యలు తీసుకుని, ప్రజ లకు అందుబాటులో ఉంచడంలో ఆర్డబ్ల్యుఎస్ అధికా రులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు లో ప్రతీ గ్రామం ముందంజ ఉండే విధంగా జాగ్రత్త వహించాలని అన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో థర్డ్ వైర్ సమస్యలు అలాగే ఉన్నాయని, ఇతర విద్యుత్ సమ స్యలైన వాటిని పరిష్కరించాలని, పేదలపై కరెంట్ బి ల్లులు అధికంగా వేసి ఇబ్బందులకుగురి చేస్తున్నారని, అధికారులు స్పందించి, సమస్య పరిష్కారం చేయాల న్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మత్స్య శాఖ ద్వారా అం దాల్సిన భీమా అందడం లేదని కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా సభలో ప్రస్తావించగా,సంబధిత అధికారి త్వరలోనే మంజూరు అయ్యేలా చూస్తామని తెలిపారు. ముఖ్యమైన పలుశాఖల అధికారులు హాజ రు కాకపోవడంతో ప్రజాప్రతినిధులు అసలు ఎందు కు సమావేశం నిర్వహిస్తున్నట్లోనని బహిరంగంగా ఒకరినొకరు చెప్పుకోవడం గమనార్హం. ఈకార్యక్ర మంలో తహశీల్దార్ పూల్సింగ్, ఎంపి డిఓ క్రిష్ణ, అధి కారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.