Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాబూబాబాద్
ప్రజలు ఇచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులు ఆదేశించా రు. సోమవారం జిల్లాలో నూతనంగా ప్రారంభించి న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ తో కలిసి ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. కేసముద్రం మండలం అర్పణపల్లికి చెందిన జాటోత్ నిహాల్ పోలియో వల్ల కుడికాలు పనిచేయడం లేదని, ఉన్న ఆస్తిని అంతా నా కాలు బాగుకే ఖర్చు చేశానని, నాకు జీవిత కాలపు సదరం సర్టిఫికెట్, వికలాంగుల ఫించను అందజేయాలని కోరారు. కేసముద్రం మం డలం సబ్ స్టేషన్ తండా గ్రామానికి చెందిన సర్పంచ్ జి.వెంకన్న గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన ప్రతిసారి కూలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆక్ర మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్ల లు ప్రహారీ గోడ లేకపోతే ఇబ్బందులకు, ప్రమాదాల కు గురి అవుతారని ప్రహారీ గోడ నిర్మించుటకు పర్మి షన్ ఇచ్చి తగు న్యాయం చేయాలని కోరారు. బయ్యా రం మండలం కంభాలపల్లి గ్రామానికి చెందిన ఎ. నాగయ్య సర్వే నెం.138లో తనకు ఉన్న 2.2 ఎక రాల భూమికి రైతు బంధు ఇప్పించాలని కోరారు. గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన జున్ను పర్వతాలు సర్వే నెం.75 తను కొనుగోలు చేసి న 20.గుంటల భూమికి పట్టా పుస్తకము ఇప్పించగ లరని కోరారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో (98) దరఖాస్తులు వచ్చాయి.
దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి...
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర త్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో గ్రీవెన్స్‌డే నిర్వహించిన అనం తరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడు తున్నందున వారికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రజావాణి నిర్వహించే తేదీలను ముందుగా దివ్యాంగులకు తెలియజేస్తూ కా ర్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.అదేవిధంగా ఉద్యో గుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రజావా ణి కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏర్పా టు చేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఫో ర్త్ క్లాస్ ఉద్యోగుల దగ్గర నుండి జిల్లా అధికారుల వరకు తమ సమస్యలను తెలియజేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 130 పాఠశాలల నుండి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అవసరమైన అల్పాహా రం ఏర్పాటు పై అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలోని వైకుంఠధామాలు సెగ్రిగేష న్ షడ్స్, డంపింగ్ యార్డ్స్‌లలో మిగిలిన పనులు పూ ర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ డేవిడ్ జడ్పీ సీఈ ఓ రమాదేవి ఆర్డిఓ కొమరయ్య డిఆర్డిఏ పిడి సన్యాస య్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.