Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
పట్టణ పరిధిలో అనుమతి లేని అక్రమ కట్టడాలపై. మున్సిపల్ రోడ్డు కబ్జా చేస్తున్న వారికి మున్సిపల్ అధికా రులు సోమవారం నోటీసులు అందజేశారు. అనంతరం కమిషనర్ కుమార్ మాట్లాడుతూ నోటీసు అందిన ఏడు రోజుల్లో సెట్ బ్యాక్ కాక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని ఇండ్లకు, మున్సి పల్ రోడ్డు ఆక్రమించిన వారికి నోటీసులు అందజేశామన్నారు. ప్రభుత్వ భూము లను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని మునిసిపల్ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను అమ్మడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్స్ కొనుగోలు చేయరాదన్నారు. అనుమతి లేని వెంచర్లు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నూతనముగా నిర్మిస్తున్న ఇండ్ల కు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కట్టడాలు చేసుకోవాలన్నారు. ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణం చేపడతారో వారికి వారికి నోటీస్ అందిన ఏడు రోజులలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలోని బిల్డర్స్, మేస్త్రిస్ ఇంటి ఆన్లైన్లో ఇంటి అనుమతి పొందిన తర్వాతనే నిర్మాణం చేపట్టాల న్నారు. నిర్మాణం చేపట్టిన యెడల వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుం టామన్నారు.కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సునీల్, జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.