Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేచ్ఛ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-జనగామ
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదని వ్యాకాస జిల్లా కార్యదర్శి వెంకట్రాజ్యం, సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓకే చందు నాయకులు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో భావ ప్రకటన స్వచ్ఛతను రక్షించుకుందాం... రాజ్యాంగాన్ని కాపాడుకుందాం... అని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ గుమ్మడి రాజుల సాంబయ్య, ప్రముఖ కవి రచయిత సాంబరాజు యాదగిరి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యసంఘాలు, పార్టీ ల నాయకులు పాల్గొని రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భావ ప్రకటన స్వచ్ఛను కొనసాగించాలని నినాదిస్తూ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మతఉన్మాద మూకలు ప్రభుత్వ ఉపాధ్యాయులు నాస్తికులు, హేతువాదులు దళితు లు, బహుజనలు అనేక రకాల పేర్లతో దాడులు దౌర్జన్యాలు హింసకాండను కొన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసు కుంటున్న మత ఉన్మాదమూకలను కఠినంగా శిక్షించి ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం, అనే మూడు విభాగాలను నిరాటకంగా కొనసాగించడానికి ప్రభు త్వాలు చొరవ చూపాలనివారన్నారు. అనంతరం ఇటీవలి కాలంలో దాడులు దౌర్జ న్యాలకు పాల్పడిన వ్యక్తులు సంస్థలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ లింగయ్యకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి కార్యదర్శి బొట్ల శేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ జనగామ జిల్లా నాయకులు నిర్మల రత్నం, జేరిపోతుల కుమార్, జితేందర్, సోమారపు ఉపేందర్, నాస్తిక సమాజం నాయకులు నవీన్, గద్దల సాయి, మోకు దెబ్బ జిల్లా నాయకులు కమ్మగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.