Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం గ్రామాల్లో దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్థానిక సర్పంచ్ పరిపాటి రుక్మిణి వెంకటరెడ్డి, ఎంఈ ఓ గుగులోతు రాము, నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ పర్వతం రాజేష్ కుమార్ అన్నారు. మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామం లో ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు హెచ్.నరేందర్ అధ్యక్షతన సోమవారం స మావేశాన్ని నిర్వహించి బహుమతులు ప్రధానం చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వత మ్మ గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులు ఒకప్పుడు తక్కువ మంది ఉండి పాఠశాల మూతపడే స్థాయికి చేరుతుందని అలాంటి పాఠ శాలను నేడు విద్యార్థులను ఎక్కువ మంది చేరే విధం గా ఆ గ్రామంలో ఇల్లు తిరిగి ప్రభుత్వ పాఠశాలకు రండి ఇంగ్లీష్ మీడియం ఉంది నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రచార నిర్వహించి విద్యార్థులను చేర్పించడం జరిగింది అని అన్నారు. ఇలాంటి పాఠశా లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేం దుకు ఒక డిజిటల్ బోర్డు, బెంచీలు, క్యాలెండర్లు, ఐడి కార్డు తదితర వస్తువులను సమకూర్చడానికి దాతలు కావాలంటూ గ్రామంలో ఆ ప్రధానోపాధ్యాయుడు నరేందర్ ప్రచార నిర్వహించారు. దీంతో దాతలుగా సుమారు 15 మంది ముందుకు వచ్చి సుమారు నా లుగు లక్షల దాకా చందాలు రాయించారని తెలి పారు. పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులను సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఆ గ్రామ చుట్టుపక్కల తండాలో ఉన్న ప్రజలు ఈ పాఠశాలకు పంపిస్తున్నారని తెలిపారు. దీంతో పాఠశాల రూపు రేఖలు మారాయని, విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించి మండలంలోని ఒక ఆదర్శ పాఠశా లగా తీర్చిదిద్దడం పట్ల ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని అభినందిస్తున్నారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ను మిగతా ప్రభుత్వం పాఠశాలలో బలోపేతానికి సహకరించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ సుధాకర్, ఉపాధ్యాయులు శశికళ, ప్రతాప్, రజిత, నాగమీర, గ్రామ నాయకులు ఎంటీవై మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పథ్వీరాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.