Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్స్‌లో పనిచేస్తున్న వర్కర్స్ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పిఎఫ్, ఎస్ఐ సౌకర్యాన్ని కల్పిం చాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ హాస్టల్ వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అభి వృద్ధి అధికారి సన్యాసయ్య వినతి పత్రాన్ని అందజేశా రు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సెప్టెంబర్ నెల నుంచి వేతనాలు లేవని వారు తెలిపారు. హాస్ట ల్స్‌లో పనిచేస్తున్న వారికి నాలుగు నెలల వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు ఇబ్బందులకు గురవు తున్నారని, తక్షణం వేతనాలను అందజేసి ఆదుకోవా లని కోరారు. అలాగే కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐలు గత ఎనిమిది నెలల నుంచి చెల్లించడం లేదని తెలిపా రు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీవో నెంబర్ ప్రకారం వేతనం 24 వేల రూపాయలు చెల్లించాలని, అలాగే ప్రతినెల రెగ్యులర్‌గా వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన అభివృ ద్ధి అధికారి సన్యాసయ్య వర్కర్స్ పెండింగ్ వేతనాల ను వెంటనే చెల్లిస్తామని, పిఎఫ్, ఇఎస్ఐ ను రెగ్యుల రైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తప్పెట్ల వీరన్న, పసుల గట్టయ్య, బండి వసంత, శ్రీల త, ఉష, స్వరూప, సుగుణ, సత్యమ్మ, స్వరూప, నాగ రాజు, బి.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.