Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్‌బెల్ట్
సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పే బీఆర్ఎస్- టీబీజీకేస్ నాయకురాలు కవిత తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్ ఎవరో చెప్పాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు ( ఏబికేఎంఎస్-బీఎంఎస్) నాయకులు జేబీసీసీఐ వేజ్ బోర్డ్ మెంబర్ ప మాధవ నాయక్ ప్రశ్నిం చారు. మంగళవారం భూపాలపల్లి ఏరియా కె టీకె-5,1 గనులో వేజ్ బోర్డులో మినిమం గ్యారెంటీ బెనిఫిట్ 19శాతం సాధించిన సంద ర్భంగా భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫిట్ సెక్రటరీ పని రమేష్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి టీఎస్ పవ న్కుమార్తో కలిసి మాధవ నాయక్ మాట్లా డారు. బొగ్గు గని కార్మికులకు 11వ వేతన సవ రణ ఉండదని, కార్మిక సంఘాలు రాజకీయ ఏజెండాతో దుష్ప్రచారం చేశారని, కానీ బీఎం ఎస్ మాత్రమే 11వేతన ఒప్పందం సాధిస్తామని కార్మికులకు భోరోసానిచ్చి నిబెట్టుకుందన్నారు. మినిమం గ్యారెంటీ బెనిఫిట్ 19 శాతం సాధించడంలో బీఎంఎస్ కేంద్ర నాయకులు కోల్ సెక్టార్ ఇన్చార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి నాj ుకత్వంలో బిఎంఎస్ ముఖ్య పాత్ర పోషించిం దని అన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల కోసంమ మెరుగైన వేతనాల సాధణకు సింగరేణి పరిరక్షణకు పోరాడతామని అన్నారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.25 వేల కోట్లు చెల్లించకుండా రూ.10వేల కోట్ల అప్పుతో సంస్థలను ఆర్థిక సం క్షోభంలో కి నెట్టిందన్నారు. కోల్ ఇండియాలో కాంట్రాక్టు కార్మికులకు రూ.930 చెల్లిస్తుంటే సింగరేణి లో మాత్రం రూ.430 ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తుంటే టిబిజీకేఎస్ గౌరవ అధ్యక్షు రాలు సింగరేణిలో అందరికంటే జీతాలు ఏక్కువ అని చెప్పడం దారుణమన్నారు. బొగ్గు బ్లాకుల వేలంకు సంబందించి పార్లమెంట్ చట్ట సభ లో మద్దతు ఇచ్చి ఇప్పుడు కేంద్రమే ప్రయివేట్ చేస్తుందని అబద్ధపు ప్రచారం చేసు ్తన్నారని మండిపడ్డారు. తాడి చెర్ల బొగ్గు గనులు ఎందుకు ప్రయివేట్ పరం చేశారని, అందులో కాంట్రాక్టులు ఎవరో కల్వ కుంట్ల కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. సుజేందర్ , నాయకులు రేణుకుంట్ల మల్లేష్, పండ్రాళ్ల మల్లేష్, బత్తుల స్వామి,ఎండి.యూసుఫ్, ఓరం లక్ష్మణ్, డి నారాయణ, కటకం శ్రీనివాస్, రమేష్, రఘుపతి రెడ్డి, గట్ల మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.