Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీడీసీఎల్ డీఈకి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ - ములుగు
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అంజద్ పాషా కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డీఈ నాగేశ్వర్రావును పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పగలు కోతలు లేకుండా 9 గంటల కరెంటు ఇవ్వాలపి. విద్యుత్ బిల్లులలో ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బషీర్బాగ్ తరహా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి గపూర్ పాషా, మండల కమిటీ సభ్యులు బోడ రమేష్, నాయకులు ప్రవీణ్, రవికుమార్, చంటి, రవి తదితరులు పాల్గొన్నారు.