Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని ఉద్యా నశాఖ అధికారి సునిల్‌కుమార్ అన్నారు. మంగళవారం మం డలంలోని రైతు వేదికల్లో ఉద్యాన, వ్యవసాయశాఖ ఆధ్వ ర్యంలో రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు ప్రాముఖ్యత, యజమాన్య పద్ధతులు, ఉద్యాన శాఖ అందించే రాయితీ తదితర వివరాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ విస్తరణ అధికా రులకు గానీ మండల వ్యవసాయ అధికారికి గాని, ఆయిల్ పమ్ కంపెనీ ప్రతినిధులకు గాని, ఉద్యాన శాఖ అధికారులకు గాని దరఖాస్తులు అందజేయాలన్నారు. అనంతరం సువేనో ఆగ్రో ఇండిస్టీ ఎండీ, జిఎంఆర్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. ఆయిల్‌పామ్ పంట సాగు రైతులకు ఎంతో మేలు అని అన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు కావాల్సిన ఫ్యాక్టరీ ని ఈ సంవత్సరం భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలాలకు అనుగుణంగా రైతులు పామాయిల్ పంట సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గి నికర ఆదాయం పెరుగుతుం దన్నారు. మొదటి మూడు సం వత్సరాల వరకు అంతర పంటల ద్వారా రైతులకు ఆదా యం సమకూరుతుందన్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఆయిల్ పామ్సాగుపై ఆసక్తి కనబర్చాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా మొక్కలకు డ్రిప్పు పరికరాలకు, నాలుగు సంవత్సరాల యాజమాన్యానికి రాయితీ లభిస్తుందన్నారు. హెచ్ఓ సునీల్ ఏవో ఐలయ్య, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి ఏఈవోలు మౌనిక, ప్రణరు, సోనీ, సర్పంచులు నారగాని దేవేందర్‌గౌడ్, చెరుకు కుమారస్వామి, శశిరేఖ రామ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోలుసాని లక్ష్మీనరసింహరావు, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ పోతర్ల అశోక్‌యాదవ్, మండల అధికార ప్రతినిధి మోతే కరుణాకర్‌రెడ్డి, అశ్వరా వుపేట రైతు ఆళ్ళపాటి ప్రసాద్‌రావు, ఆళ్ళ జంగం, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.