Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలం వ్యాప్తంగా తాసిల్దార్ అల్లం రాజ్‌కమార్ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకున భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరి గింది. మండల ప్రధాన వైద్యాధికారి సుకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మండలంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీటసీ ఆలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ 2019 వరకు నమోదైన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. అనంతరం రైతుబంధు రైతు బీమా వివరాలను వ్యవసాయ శాఖ అధికారి జితేందర్ రెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ లేని రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ శ్రీనివాసరావు కోరారు. అనంతరం మంచినీటి సరఫరాపై జరిగిన సమీక్షలో సర్పంచ్ మోహన్ రాథోడ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ గ్రామానికి మంచినీటి సరఫరా జరగడం లేదని అన్నారు. ఫిబ్రవరి 15 తారీకు వరకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తామని అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న, ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి చాపల ఉమాదేవి ధారావతు పూర్ణచ వెలిశాల స్వరూప, లావుడియా రామచందర్, సర్పంచులు, అధికారులు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.