Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మహదేవపూర్
మహాదేవపూర్ మండలవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనాసాగుతోంది. మంగళవారం పలు గ్రామాల్లో ప్రజలకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించారు. మహాదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాల య ఆవరణలో సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో కొనసా గుతున్న కంటి వెలుగు శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రం నిర్వహణ సర్పంచ్ పనితీరు పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక కంటి వ్యాధులకు పరిష్కారంగా కంటి వెలుగు శిబిరాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని ఆయన అన్నారు. కంటి వెలుగును సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేసికొని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ ముందు చూపుతో చేసిన గొప్ప సేవా కార్యక్రమమే కంటి వెలుగు అని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.
అంబట్పల్లి పీహెచ్సీ పరిధిలో...
అంబట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ జగదీష్ తెలిపారు. వందశాతం కంటి పరీక్షలు చేయించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవ గాహన కల్పించాలన్నారు. స్టాఫ్ నర్స్ మరియా, ఆప్తమలజిస్ట్ మేడిపల్లి రవళి ఆశ వర్కర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
కాలేశ్వరం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో
కాళేేశ్వరం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో నిర్వ హిస్తున్న కంటి వెలుగు క్యాంపును మంగళవారం ఎంపీడీవో శంకర్ సందర్శించారు. సర్పంచ్ వేన్నపురెడ్డి వసంత, ఎంపీ టీసీ రేవెల్లి మమత , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత, క్యాంప్ ఇన్చార్జి డాక్టర్ రవి, ఈజిఎస్ ఏపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.