Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో ఎంపిక చేయబడిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎంపిక చేయబడిన మోడల్ పాఠశాలల రూపకల్పన కోసం విద్యా శాఖ, ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో పనుల పురోగతిని తెలు సుకున్నారు. మోడల్ పాఠశాలల పెయింటింగ్ పట్ల పలు సూచనలు చేశారు. కాంట్రాక్టర్లు అధికారుల ఫోన్ కాల్స్‌కు స్పందించాలని కోరారు. పనుల పురోగతిని వాట్సాప్ గ్రూప్ ద్వారా అప్లోడ్ చేయాలని తెలిపారు. కాంట్రాక్టర్ 10-15 బృందాలను ఏర్పాటు చేసి, పుట్టి, పెయింటింగ్ పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెయింట్ పని పురోగతి ఆన్లైన్ ద్వారా ఏరోజుకారోజు అప్‌లో డ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, ఈడియం సామాజి దేవేందర్, కాంట్రాక్టర్స్ విజయ్ సీంహ రెడ్డి, పెయింటింగ్ కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.