Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెగ్రిగేషన్ షెడ్‌ను మంగళవాొర డీఎల్పీఓ సుధీర్ పరిశీలించారు.వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ గురించి గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.సెగ్రిగేషన్ షెడ్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం స్మశాన వాటికను పరిశీలిం చారు. గ్రామ పంచాయతీ నర్సరీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు, ఎంపీఓ ప్రసాద్,గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.