Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
విద్యార్థినులు ఆత్మస్క్థెర్యంతో, మనో ధైర్యంతో అవంతరాలను అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కస్తూర్భాగాంధీ ఎస్ఓ లక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యా నిలయంలో బాలికల దినోత్సం సందర్భంగా సాంస్కృతిక, ఆత్మరక్షణ పై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమన్నారు. ఆధునిక ప్రపంచంలో ఆడవారికి ఎక్కువ అవకశాలు ఉన్నాయని, అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో టీచర్లు రమాదేవి, శ్రీదేవి, స్వరూప, రమాదేవి, విజయ, హరిత, వరలక్ష్మి, అక్తరున్నీసా, ప్రశాంతి, లత, స్వరూపరాణి, అన్నపూర్ణ, పీజీ సీఆర్టీలు సంధ్య, మాలతి, నిరోష, ప్రశాంతి, అనిత, రజిత, సుమలత పాల్గొన్నారు.