Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లారుగూడలో సీలింగ్ భూమిని పట్టా చేసిన వైనం.
- అధికారులు,పోలీసుల పట్టించుకోవడంలేదు : యజమానులు
నవతెలంగాణ-సంగెం.
నగర ప్రాంతాలకి విస్తరించి ఉన్న కబ్జాపర్వం ఇప్పుడు పల్లెల్లో కూడా విస్త రిస్తోంది. ఇందుకు సంగెం మండలం పల్లార్గూడ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకెళ్తే... పల్లార్గూడ గ్రామంలో 20 సంవత్సరాలుగా సీలింగ్ భూమిగా గుర్తించి, అందులో ఉన్న గ్రానైట్ క్రషర్ తవ్వకాలను గతంలో ప్రభుత్వం మూసి వేసింది. ఈ తరుణంలో కాస్తూలో ఉన్న కొంతమంది దళితులు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు పాత యజమాని కాకుండా కొత్త కబ్జా కోరులు తమ భూమి అంటూ చదును చేస్తూ ఆ భూమిలో ఉన్న నల్ల గ్రానైట్ నిలువలను గుర్తించి వాటి మీద కన్నేశారు. అధికారులు, పోలీసుల కనుసన్నల్లో మెదులుతూ అమాయకపు రైతులను మోసగి స్తున్నారని 20 మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. పల్లారుగూడ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 455, 456, 489, 495, 497, 503 సీలింగ్ భూమిని గ్రామ పేదలకు, దళితులకు కాస్తు నిమిత్తం ఇచ్చారు. ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు పలుమార్లు ఆర్జీ పెట్టుకున్న పట్టాలు ఇవ్వలేదు. కానీ, 2020లో రత్నశిల గ్రానైట్స్కి పట్టా ఇచ్చారని బాధితులు మండిపడుతున్నారు. రత్నశీల గ్రానైట్స్ నుండి పట్టా చేసుకున్నట్టు కొంతమంది వ్యక్తులు భూమిని చదును చేస్తుండగా కాస్తులో ఉన్న రైతులు, దళితులు వారిని ఎదిరించి అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు వారికి అండగా నిలవ కపోవడం గమనార్హం. అధికారులు చర్యలు తీసుకుని సీలింగ్ భూమిని గుర్తించి పేదలకు,రైతులకు అందించి పట్టాలి ఇప్పించాలని కోరుతున్నారు.
మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు : ఇప్ప స్రవంతి రాజేందర్
మాకు సర్వేనెంబర్ 455లో రెండు ఎకరాల 19 గుంటల భూమి మా ఆధీనంలో ఉన్నప్పటికీ ఇతరుల పేరు మీద ఎలా పట్టా అయిందో అధికారులు చెప్పాలి. దాన్ని కబ్జాదారులు ఆక్రమించుకొని మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎంతకైనా తెగించి మా భూమిని మేము కాపాడుకుంటాం.
ఇప్పుడు ఎలా పట్టా అయింది ?: గుగులోతు చందూలాల్
సీలింగ్ భూమిని ఇప్పటివరకు పట్టా చేయకుండా అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ నన్ను తిప్పుకొని, దొంగతనంగా మా ప్రమేయం లేకుండా, గత యజమానుల ప్రమేయం లేకుండా 2020 ఇతరుల పేరున పట్టా ఎలా అయిందో అధికారులు తెలియజేయాలి. మా భూమి మాకు వచ్చే వరకు ఈ భూమిలోనే వంటావార్పుచేసి, నిద్రాహారాలు కూడా ఇక్కడనే చేస్తాం.