Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై రాస్తారోకో..
నవతెలంగాణ-రేగొండ
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎసిడి, అడిషనల్ కన్జమశన్ డిపాజిట్, విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్ చేశారు. మంగళవారం రేగొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు భూపాలపల్లి - పరకాల ప్రధాన రోడ్డుపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లా డుతూ.. గత ప్రభుత్వ పాలనలో విద్యుత్తును విని యోగదారులు ఎంత వాడుకుంటే అంత బిల్లు చెల్లించేదని, కానీ స్వరాష్ట్రంలో రెండు నెలల అడ్వాన్స్ బిల్లులు చెల్లించే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.. కరోనా లాంటి విప త్కర పరిస్థితుల అనంతరం నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, మధ్యతరగతి ప్రజలపై పెనుబారంగా మారాయని అన్నారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలతోపాటు అదనపు ఏసీడీ ి చార్జీలు జతచేసి వసూలు చేయడం దారుణ మన్నారు. ఏసిడి డ్యూ పేరుతో కొత్తరకం చార్జీలు వేయడంతో సామాన్య వినియోగదారులు ఆ బిల్లులను చూసి నిర్గాంతపోయే పరిస్థితి ఏర్పడిం దన్నారు. ఏసీడీ చార్జీలను ఉపసంహరిం చుకోవా లన్నారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూటోజు కిష్టయ్య, మేకల రవికుమార్, బానోత్ రవీందర్, కాశెట్టి రాజయ్య, సూదనబోయిన ఓంప్రకాష్, పన్నాటి శ్రీను, కౌడగాని తిరుపతి, రాజబాబ, కోసరి నరేందర్, తోట రఘు, శ్రీపతి సంతోష్, సిద్ధ కరుణాకర్, తోట నగేష్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : విద్యుత్ ఎసిడి అదనపు చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని విద్యుత్ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి అధ్యక్షులు గుట్ల తిరుపతి పాల్గొని ఏఈ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఏసిడీ చార్జీలు తగ్గిం చకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిం చారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల అధ్యక్షులు మెరుగు లక్ష్మి. వికలాంగుల చైర్మన్ కొడారి సారయ్య, ఎంపీటీసీ దబ్బేట అనిల్ ఎస్సీ సెల్ బొట్ల రవి, బుర్ర లక్ష్మణ్ గౌడ్ సీనియర్ నాయకులు రాయకుమురు పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు.