Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుస కేసులతో హల్చల్
- కార్పొరేటర్లలో ఆందోళన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ నగరంలో కార్పొరేటర్ల భూకబ్జాలపై వరుసగా కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. తొలుత బిఆర్ఎస్కు చెందిన 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌ను పోలీ సులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో నగరంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తా జాగా కాజీపేట ప్రాంతానికి చెందిన 62వ డివిజన్ కార్పొ రేటర్ కాంగ్రెస్‌కు చెందిన జక్కుల రవీందర్‌పై మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్ట్ నేపథ్యంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లలో అల జడి ప్రారంభమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ జక్కుల రవీందర్‌పై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. జనగా మ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డికి కార్పొరేటర్ జక్కు ల రవీందర్ ప్రధాన అనుచరుడు. రవీందర్‌పై కేసు నమో దు కావడాన్ని 'జంగా' తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్ పార్టీకి చెందిన తన అనుచరుడిపై కేసు నమోదు చేశారని, ఈ విషయంలో నిజానిజాలను నిర్ధారించాలని, రవీందర్ భూకబ్జాలు చేసేవాడు కాదని స్పష్టం చేశారు. కార్పొరేటర్లపై భూకబ్జా కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ వరంగల్ నగరం పరిధి లో భూముల వ్యవహారాలు, వివాదాల్లో కార్పొరేటర్ల ప్రత్యక్ష పాత్ర వుందన్నది బహిరంగ రహస్యమే. దీనికి పరోక్షంగా గాడ్ ఫాదర్లుగా వున్న సంబంధిత ఎమ్మెల్యేల పాత్రపై సర్వత్రా చర్చ సాగుతుంది. భూకబ్జాలలో పాత్ర వున్న కార్పొ రేటర్లపై కేసులు పెడుతున్నా పోలీసులు, తెర వెనుక ఉన్న పెద్దలపై కేసులు పెడుతారా ? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ నగరంలో కార్పొరేటర్లపై భూకబ్జా కేసులు నమోదు కావడం, అరెస్ట్‌లు జరుగుతుండడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో, నగర శివార్లలో భూములకు విపరీతమైన డిమాండ్ పలుకుతుండడంతో భూ వ్యవహారాలు, వివాదాల పరిష్కారం పేరిట కార్పొరేటర్లు జోక్యం చేసుకొని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సెటిల్మెంట్లు చేస్తున్న పరిస్థితి వుంది. ఈ వ్యవహారాల తెర వెనుక ప్రజాప్రతిని ధులున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కాకతీయ కాలనీలో ఒక భూమి కబ్జా విషయంలో భాధితులు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఛీఫ్ విప్, బిఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినరుభాస్కర్‌కు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్ట్ బిఆర్ఎస్ కార్పొరేటర్లలో అలజడి సృష్టించింది. వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎ.వి. రంగనాధ్ వచ్చాక శాఖపరంగా తప్పు చేసిన పలువురు పోలీసు అధికారులను సైతం సస్పెండ్ చేసిన విషయం విదితమే. నగరంలో భూ కబ్జా లపై దృష్టిసారించిన పోలీసు కమిషనర్ భూకబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్, జనగామ డిసిసి అధ్య క్షులు జంగా రాఘవరెడ్డి ముఖ్య అనుచరుడు జక్కుల రవీందర్‌పై భూ కబ్జా కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతు న్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో వాస్తవమని తేలితే అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ కబ్జాలు చేసేవాడు కాదని, సంబంధిత భూమిని కొనుగోలు చేసిన అన్ని పత్రాలున్నాయని, విచారణ చేసి నిజనిజాలు తేల్చాలని జంగా రాఘవరెడ్డి కోరడం గమనార్హం. జక్కుల రవీందర్‌పై కేసు పెట్టడంలో రాజకీయ కుట్ర వుందని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌పై భూకబ్జా కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన విషయాన్ని మళ్లిం చడానికే కాంగ్రెస్ కార్పొరేటరైన నా అనుచరుడిపై కేసు పెట్టారన్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
మరికొందరు కార్పొరేటర్లపై..?
నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న మరికొందరు కార్పొరేటర్లపై కూడా కేసులు నమోదయ్యే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయ పార్టీల అండదండలతో బెదిరించి భూ సెటిల్మెంట్లు చేసిన వ్యవహారంలో బాధితులు ఒక్కరొక్కరు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పోలీసు అధికారులు కార్పొరేటర్లపై కేసులు పెట్టడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో నగరంలో మరికొందరు కార్పొరేటర్లు, రాజకీయ నేతలపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఈ కేసుల నేపథ్యంలో పొలిటికల్ డ్యామేజీ కాకుండా నష్టనివారణలో భాగంగా పరస్పరం కేసులు పెట్టుకునే ప్రయత్నంలోనూ రాజకీయ పార్టీల నేతలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా భూకబ్జాల వ్యవహారం, కేసులు, అరెస్ట్‌లు ఆద్యంతం ఆసక్తికరంగా మారాయి.