Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ఫీల్డ్ మార్షల్ కరియప్ప వేసిన పునాదులతోనే భారత్ నేడు బలమైన సైనిక శక్తిగా మారిందని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ డాక్టర్ చంద్రమౌళి అన్నారు. వడ్డేపల్లి పింగిలి ప్రభుత్వ మహిళ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో శనివారం ఫీల్డ్ మార్షల్ కరియప్ప 124వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్సిసి 8వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రమౌళి పాల్గొని కరియప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరించారు. కరియప్ప చరిత్ర నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్సిసి అధికారిగా అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. సుహాసిని, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి రామకష్ణారెడ్డి, డాక్టర్ కల్పన , యు వినరు కుమార్ మరియు ఎన్సిసి క్యాడేట్స్ సీనియర్ అండ్ ఆఫీసర్ అవంతి, దివ్య, విద్యార్థులు పాల్గొన్నారు.