Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ గణేష్ కుమార్
నవతెలంగాణ-ఆత్మకూర్
అతివేగం అజాగ్రత్త వల్ల జరుగుతున్న ప్రమాదాల నివారణే పోలీసుల లక్ష్యమని సీఐ తౌటం గణేష్ కుమార్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి పై వాహనాల తనిఖీలను నిర్వహించి సీఐ మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడిపినా, సంబంధిత వాహన పత్రాలు లేకున చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారి కావడంతో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. యువకులు అతివేగం,అజాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారని వారి పై ద్రుష్టి సారించి కేసులు నమోదు చేస్తే భవిషత్తులో ఎలాంటి ఉద్యోగాలు రావన్నారు. యువత పోలీసులకు సహకరిస్తూ రోడ్డు భద్రతానిబంధనలు పాటించాలన్నారు. లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ వాహనాల తనిఖీలలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.